ప్రస్తుతం మూడో విడత లాక్ డౌన్ లో  భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని  సడలింపు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలలో ఉన్న వలస కూలీలు అందరూ స్వస్థలాలకు దారి పడుతున్నారు. ఇక వలస కూలీలు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నారు. అయితే వలస కూలీల విషయంలో  ఒక్కొక్క రాష్ట్రం  ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. తమ రాష్ట్రానికి తీసుకెళ్లి వారి కోసం ప్రత్యేకంగా ఒక క్వారంటైన్  ఏర్పాటు చేసి వారందరినీ అక్కడి ఉంచి  భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసింది. 

 


 ఇక కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతనే వలస కూలీల అందరి ఇంటికి పంపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 11 లక్షల మంది వలస కార్మికులకు 1000 రైళ్ల ద్వారా ప్రస్తుతం ఇప్పుడు వరకు తీసుకెళ్ళింది. మరికొంత మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇక వలస కూలీల కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి . అయితే తాజాగా నాగాలాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

 

 అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి నటువంటి వలస కార్మికులను  ఇతర రాష్ట్రాల నుంచి రావొద్దు అంటూ చెబుతుంది నాగాలాండ్  సర్కార్. 18 వేల మంది నాగాలాండ్ కి చెందిన వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో ఉండగా వారిని రావద్దు అని చెబుతోంది. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేకుండా ఉన్న నాగాలాండ్లో వలస కూలీల వల్ల  వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నది  ప్రభుత్వం. ఇదే సందర్భంలో ఎవరు నాగాలాండ్ కి రావద్దు అని మీరు ఉన్నచోటే ఉండాలని మీ అందరికీ పదివేల రూపాయలు ఇస్తామని అక్కడే మీకు కావాల్సిన వసతులు కల్పించుకుని అక్కడే ఉండాలని నాగాలాండ్ మాత్రం రావద్దు అని చెబుతోంది. ప్రస్తుతం ఈ నిర్ణయం కాస్త సంచలనం గా మారిపోయింది. మరి మిగతా రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారా  లేకపోతే ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: