మన దేశంలో ఏదైనా మంచి చేయాలి అనుకుంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే మేకిన్ ఇండియా అన్నది ఒకప్పుడు జాతిపిత గాంధీజీ ఇచ్చిన పిలుపు. గాంధీ ఇచ్చిన పిలుపును ఆనాడు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ పాటించారు. ఎందుకంటే బయట దేశాల నుంచి పరిశ్రమలు వచ్చి మన దేశంలో పెట్టుబడులు  పెట్టడం ద్వారా భారత పరిశ్రమల అభివృద్ధి చెందడం ద్వారా.. భారత వృద్ధి రేటు పెరుగుతుందని. కాగా ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మేకిన్ ఇండియా అనే దాన్ని తెరమీదికి తెచ్చింది. 

 


 అయితే మోదీ ఇలాంటి నినాదం తెరమీదికి తేవడంతో సరికొత్త పాయింట్ లతో  ప్రస్తుతం ప్రతిపక్షాలు తెరమీదికి తెస్తూ మోడీ పై ఆరోపణలు చేస్తున్నాయి. అదేంటంటే.. మోడీ ప్రధాని అయిన తర్వాత బీఎండబ్ల్యూ కార్ వాడుతున్నారని దాన్ని వాడటం మానేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మాములుగా అయితే రేంజ్ రోవర్ కార్ వాడాల్సి ఉన్నప్పటికీ భద్రత రీత్యా ప్రస్తుతం ప్రత్యేకంగా తయారు చేయించిన బీఎండబ్ల్యూ కార్ వాడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించే మొబైల్ ఫోన్ కూడా  విదేశాలకు సంబంధించినది.. దాన్ని కూడా వాడడం  మానేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 

 అంతేకాకుండా.. మోడీ ఎటువంటి  రోలెక్స్ వాచ్ వాడుతారు.. దాన్ని వాడటం  మానేస్తారా  అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మోడీ లక్షల విలువైన ఎటువంటి విదేశీ పెన్ వాడతారని దాన్ని వాడటం మానేస్తారా... అంతేకాకుండా మోదీ ఏకంగా జర్మన్ మెయిడ్  కళ్లద్దాలు ధరిస్తారని దానిని వాడటం మానేస్తారా.. అని ఆరోపణలు చేస్తున్నాయి  ప్రస్తుతం ప్రతిపక్షాలు. అయితే విదేశీ వస్తువులను వాడడం మానేస్తారా అని ప్రశ్నించడం తప్పుకాదు అని అంటున్న విశ్లేషకులు అదే సమయంలో విదేశీ సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టేలా  చేస్తారా అని అడిగితే బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: