తబ్లిక్ జమాత్ సమావేశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమావేశం. దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ కేసులు పెరిగి పోవడానికి కారణమైన సమావేశం... ఎంతోమందిని మృత్యువు ఒడిలోకి చేర్చిన  సమావేశం. మర్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన వారి కారణంగానే భారత్లో ఎక్కువగా మహమ్మారి వైరస్ వ్యాప్తి జరిగింది అన్నది అందరు ఎరిగిన వాస్తవం. అయితే ఈ సమావేశం చాలా రోజుల వరకు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తబ్లిక్ జమాత్ సమావేశం గురించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. 

 

 తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే... 166 మంది జమతీతీయులను విచారించగా... వాళ్లలో  సాద్  కుమారుడు బంధువులు కూడా ఉన్నారు. ఇక సాద్ ఉద్దేశపూర్వకంగా జామాతీయులను   ఆపేశారు అన్నట్టువంటిది  తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణలో తేల్చారు. 700 మంది విదేశీ జమాతీయులు  పాస్పోర్టులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న తర్వాత... వాళ్ళు వీసాల ఉల్లంఘనకు పాల్పడ్డారు అన్న విషయం బయటపడింది. 

 

 మార్చి నెలలో 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించారు. అప్పటికే ఢిల్లీ మర్కజ్ భవనంలో  వేలాది మంది ఉన్నారని.. అంతకుముందే సమావేశం వద్దని చెప్పినప్పటికి కూడా ఏం పర్లేదు ఉండండి అని  చెప్పడం అది నెలలో సదస్సు తర్వాత కూడా వారిని భవనంలోనే ఉండాలి మీకేం కాదు అని చెప్పడం... దేశవ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించినప్పటికీ కూడా అక్కడి తబ్లిక్ భవనంలోనే ఉండాలని... చెప్పారు అంటు విచారణలో తెలిపారు జమతియులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొంతమందితో మాత్రమే సమావేశం నిర్వహించాలని నోటీసు ఇచ్చినప్పటికీ.. నిర్లక్ష్యంగా వేల మందితో సమావేశం నిర్వహించారని.. ఇది అపడమిక్ యాక్ట్ కిందకు  వస్తుంది. దీంతో ప్రస్తుతం దీనిపై కూడా విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: