దేశంలో కరోనా వైరస్ మొదట కేరళాలో కనిపించింది.. అక్కడ విదేశాల నుంచి వచ్చినవారికి ఈ వైరస్ సోకినట్లు తెలిపారు.  అలా మెల్లి మెల్లిగా ఈ కరోనా వైరస్ దేశం మొత్తం వ్యాప్తి చెందింది.  మొదట్లో విదేశీయుల ద్వారా.. తర్వాత మర్కజ్ సమావేశాల్లో పాల్గొని వచ్చిన వారి ద్వారా కారణాలు ఏవైనా ఇప్పుుడు వైరస్ తీవ్రత మాత్రం బీభత్సంగా మారింది. కరోనా మహమ్మారి ఇప్పుడు గుజరాత్‌ను పట్టిపీడిస్తోంది. వైరస్ ఉద్ధృతి కొనసాగిన తొలి రోజుల్లో రాష్ట్రంలో ఆ ఊసే లేదు. కానీ రెండు నెలలు గడిచేసరికి కేసుల్లో ఏకంగా రెండో స్థానానికి, ప్రస్తుతం మూడో చేరుకోవడాన్ని బట్టి చూస్తుంటే వైరస్ అక్కడ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కరోనా ఇంతగా వ్యాప్తి చెందడానికి గల కారణం  ఆ మద్య ఢిల్లీ లో మర్కజ్ సమావేశాల్లో పాల్గొని వచ్చిన తబ్లిగీల కారణంగా పెరిగిపోయాయని అంటున్నారు.

 

ఇక పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న 126 మంది తబ్లిగీలను పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రులకు తరలించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన వారినీ గుర్తించారు. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్, భుజ్ తదితర పట్టణాల్లోనూ కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాతి నుంచి క్రమంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అహ్మదాబాద్‌లో ఇప్పటి వరకు 334 మంది సూపర్ స్ప్రెడర్లను అధికారులు గుర్తించారు.

 

వీరిలో కూరగాయల వ్యాపారుల నుంచి చెత్త సేకరణ కార్మికుల వరకు ఉన్నారు.అయితే వీరంతా వృత్తిపరంగాకలవాల్సి ఉండడంతో వారి ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమిస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిన్నటి వరకు నగరంలోని అన్ని దుకాణాలను మూసివేశారు. ఇటీవల  కరోనా బారినపడి చనిపోయిన వారిలో కాంగ్రెస్ మునిసిపల్ కౌన్సిలర్ బద్రుద్దీన్ షేక్, కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో నేత హబీబ్ మెవ్ లాంటి వారు కూడా ఉన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: