ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. కరోనా కష్ట కాలంలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతుల ఖాతాలలో 5,500 జమ చేశారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల పలు రాష్ట్రాలు సంక్షేమ పథకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. కానీ జగన్ మాత్రం కరోనా కష్ట కాలంలో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటారు. జగన్ గత నెలలో మహిళలకు సున్నా వడ్డీ విడుదల చేశారు. 
 
అనంతరం జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు. తాజాగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఖాతాలలో నగదు జమ కావడంతో రైతులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ కష్టాలు తీరాయని.... రైతు భరోసా కేంద్రాల ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతోందని చెబుతున్నారు. సీఎం జగన్ తమ కష్టాలను పాదయాత్రలో చూశారని... ఆదుకుంటామని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. 
 
జగన్ చేస్తున్న మేలు ఎప్పటికీ మరిచిపోలేమని... జగన్ వైయస్సార్ లాగే రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సాగు కోసం రుణాలు తెచ్చుకున్న రైతులు ఆ రుణాలను తీర్చలేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు రుణాలు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. 
 
మహానేత వైయస్సార్ అటవీ భూములకు పట్టాలిచ్చి గిరిజన రైతులకు దేవుడయ్యారని... ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో పంట పెట్టుబడులకు అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొందని.... కరోనా కష్ట కాలంలో జగన్ చేస్తున్న మేలును మరవలేమని రైతులు చెబుతున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 18 నుంచి విత్తనాల సరఫరా జరుగుతుందని అన్నారు. హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. రైతుల కోసం రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని... రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: