తెలంగాణలో కరోనా కట్టడి చేయడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు.  వాస్తవానికి దేశ వ్యాప్తంగా రేపటితో లాక్ డౌన్ ముగినున్న విషయం తెలిసిందే. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ 29 వరకు పొడిగించారు.  అప్పటి వరకు కేసులు తగ్గు ముఖం పట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.  కంటోన్మెంట్ విషయంలో ఎవరినీ బయటకు రాకుండా లాక్ డౌన్ పటిష్టంగా నిర్వహించాలని చూస్తున్నారు.  లాక్‌డౌన్‌ నిబంధనలను కొంతమంది బేఖాతరు చేస్తూ అదేపనిగా రోడ్లపైకి వస్తున్నారు. పగలు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నా.. రాత్రివేళ అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కఠినంగా ఇకపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఉదయం, సాయంత్రపు నడకకూ అనుమతి లేదు అని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. 

 

రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ ఎవరూ రోడ్లపైకి రాకూడదని ఆయన కోరారు. పగటిపూట ఐటీ, నిర్మాణ రంగాల వారికి అనుమతులు ఇచ్చిన కారణంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.  ఇక  కొంతమంది రాత్రి వేళల్లో రోడ్లపైకి వస్తున్న విషయాన్ని గమనించిన సీపీ.. ఆ సమయంలో బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు.  లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 57 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దానికితోడు మరో 9 ఇంటర్నల్‌ చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వేళలో తిరిగే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయనున్నారు. 

 

ఈ మద్య కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయని.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిథిలోనే కేసులు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. అత్యవసర సేవలు, అనుమతి ఉన్నవారికి మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. సైబరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకూ దాదాపు 9 లక్షల కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన 20,591 వాహనాలను సీజ్‌చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: