తెలంగాణ రాజకీయాల్లో  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభుత్వం తీరును ఎండగట్టడం  లో జగ్గారెడ్డి ఎప్పుడూ ముందుంటారు అనే విషయం తెలిసిందే. ఎప్పుడూ అధికార పక్షంపై ఘాటైన విమర్శలు చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంటారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనదైన పదునైన భావజాలంతో అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఉంటారు జగ్గారెడ్డి. 

 

 

 అయితే ఎప్పుడూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ విమర్శలు చేసే జగ్గారెడ్డి తాజాగా మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతూ కాళేశ్వరం అనే మహోన్నతమైన ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు హరీష్ రావు. తాజాగా జగ్గారెడ్డి హరీష్ రావు గురించి మాట్లాడుతూ... హరీష్ రావు మంత్రి కాదు... ఒక పెద్ద నీటి దొంగ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 

 

 హరీష్ రావు తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తాను అంటూ చెప్పుకొచ్చారు... అయితే గతంలో హరీష్ రావుకు ఎందుకు సన్మానం చేయాల్సి వచ్చిందో తర్వాత ఎపిసోడ్ లొ చెబుతాను అంటూ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సన్మాన సభలో కేసిఆర్ గురించి హరీష్ రావు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అన్ని  నిజాలు త్వరలో బయట పెడతానంటూ తెలిపాడు. మంజీరా నీటిని అక్రమంగా తరలించి హరీష్ రావు సంగారెడ్డి ప్రజల గొంతు కోశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు... కలెక్టర్లు అధికారులు కూడా హరీష్ రావుకు ఊడిగం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: