ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు మరో పార్టీకి చెందిన కార్యకర్తలపై దాడులు చేయడం ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఈ దాడులు హింసాకాండను తలపిస్తున్నాయి. ఏకంగా కొంత మంది ఎమ్మెల్యేలపై కూడా కొంతమంది ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు దాడులు చేయడం రాష్ట్ర  రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మంత్రులు ఎమ్మెల్యేల పై కూడా దాడులు చేయడం వివాదాస్పదంగా మారి పోయింది. అయితే మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తల దాడి చేయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 

 

 ఇకపోతే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు పై ఏకంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత దాడి చేయడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత తనపై చేయి  చేసుకున్నాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 

 తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట లో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాను లీలా కృష్ణ అధికార పార్టీ కార్యకర్త అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  రాచకొండ  భీమరాజు పై చేయి  చేసుకున్నాడు. ఇక ఈ ఘటనలో తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త రాచకొండ భీమరాజు... పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: