టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా  లోకేష్ పై నిత్యం పంచ్ డైలాగులు పేల్చుతూ వారు సమాధానం చెప్పుకోలేని విధంగా విమర్శలు చేసే విషయంలో  ఎప్పుడూ ముందు ఉంటూ వైసీపీ తరపున రాజకీయ ప్రత్యర్థుల విషయంలో విమర్శలు చేయడంపై విజయసాయిరెడ్డి బాగా ఆరితేరిపోయారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై ఎప్పుడూ ఇదేవిధంగా విజయసాయి రెడ్డి  వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అదే విధంగా విమర్శలు గుప్పించారు. '' అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తే జీతాలెలా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తుప్పు, పప్పు రెండు నెలలుగా పొరుగు రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వ సదుపాయాలెలా ఉపయోగించుకుంటున్నారో చెప్పాలి. ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా ? అంటూ విమర్శలు చేసారు విజయసాయిరెడ్డి.

 

ఇక మరో ట్విట్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. ''ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వసతులు కల్పించడంలో దేశంలోనే రాష్ట్రం ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది.16 వేల కోట్లతో పదివేల వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల ఏర్పాటుకు సిఎం జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజల ముంగిటకు వైద్య సదుపాయలు తీసుకెళ్లే అసాధారణ కార్యక్రమం ఇది.'' అంటూ ఆయన ట్విట్ చేశారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: