పది రోజుల క్రితం విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందగా వందల సంఖ్యలో బాధితులు అస్వస్థతకు గురయ్యారు. విశాఖ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల ప్రజల్లో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ గ్యాస్ లీకేజీ పాపం ఎవరిది...? అనే ప్రశ్నకు ఎల్జీ పాలిమర్స్ దే ఆ పాపం అని తెలుస్తోంది. 
 
ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. నివేదికలు కూడా ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సంస్థలో ఉన్న స్టెరైన్ గ్యాస్ ను తరలించింది. ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఘటనలో సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సిబ్బంది, ఉన్నతాధికారులు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. 
 
గతంలో నమోదైన కేసుల విషయంలో అరెస్టులు జరగాల్సి ఉంది. ఈ ఘటన సాధారణ అంశం కాదు..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన. యాజమాన్యం బాయిలర్ పేలుతుందని భయపడి గ్యాస్ ను బయటకు రిలీజ్ చేసిందని సమాచారం. యాజమాన్యం నిర్వహణ లోపాలే ప్రధానంగా గ్యాస్ లీకేజీకి కారణమని నిపుణులు చెబుతున్నారు. 
 
లాక్ డౌన్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సంస్థ, ఆ సంస్థ సిబ్బంది, నిర్వాహకులు చేసిన పొరపాట్ల వల్ల వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం, సిబ్బంది ఈ ఘటన చోటు చేసుకోవడానికి కారణం కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎల్జీ పాలిమర్స్ బాధితులు భవిష్యత్తులో కూడా తీవ్ర అనారోగ్య సమస్యల భారీన పడే అవకాశం ఉంది. ఈ ఘటనలో కఠిన చర్యలు తీసుకోవడానికి జగన్ సర్కార్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: