ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు కోర్టుల్లో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక విషయాల్లో జగన్ సర్కార్ కు కోర్టులు ఝలక్ ఇచ్చాయి. లీగల్ విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ సరైన విధానాన్ని పాటించకపోవడం వల్లనే హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రధానంగా అమరావతి భూముల విషయంలో. కాకినాడ భూముల విషయంలో జగన్ సర్కార్ కు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించకపోవడం వలన ఈ పరిస్థితి ఎదురవుతుందా..? లేక తీసుకున్న నిర్ణయాలోలో ఏవైనా లోపాలు ఉన్నాయా..? అన్న విషయంపై జగన్ సర్కార్ ఇప్పటికైనా దృష్టిసారించాలని, లేనిపక్షంలో ముందు ముందు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

ఇలా ముందస్తుగానే ఒక న్యాయ నిపుణుల బృందాన్ని నియమించుకుని సలహాలు సూచనలు తీసుకోవడం వలన కోర్టులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. లేనిపక్షంలో మూడు అడుగులు ముందుకు.. ఏడు అడుగులు వెనక్కి వెళ్లినట్టు అవుతుందని చెబుతున్నారు. ఈ రెండు అంశాల్లోనే కాకుండా రాష్ట్ర‌ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పుడు ఆ విషయం కూడా హైకోర్టులో ఉంది. అలాగే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలన్న అంశంలో కూడా హైకోర్టు నుంచి ప్రతికూల తీర్పు వచ్చింది. అయితే.. పిల్లల తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఇంగ్లీష్ మీడియం లేదా తెలుగు మీడియం ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే న్యాయనిపుణులతో చర్చించడం వలన వారి సలహాలు తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ ఆ వైపుగా అడుగులు వేస్తారో.. లేదో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: