నిన్నబెంగళూరు అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కన్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు.  గతలో ఆయన శరీరంలో ఐదు బుల్లెట్లు దిగినా చావని వ్యక్తి క్యాన్సర్ కి తలవంచక తప్పలేదు. చిన్న బ్యాంకు ఉద్యోగిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ముత్పప్ప రాయ్ తర్వాత రియల్ ఎస్టేట్ రారాజుగా ఎదిగారు.  ఇదే క్రమంలో ఆయనకు పలువురు అండర్ వరల్డ్ డాన్స్ తో పరిచయాలు ఏర్పడటంతో తాను కూడా మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించారు.  చీకటి రాజుగా కొంత కాలం దందాలు నిర్వహించారు.  ఓ కేసుకు సంబంధించి ఓరోజు బెంగళూరు కోర్టుకు హాజరవగా.. ప్రత్యర్థులు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ దాడిలో ముతప్ప రాయ్‌కి ఐదు బుల్లెట్లు దిగాయి.  అప్పట్లో ఆయన చావు అంచుల వరకు వెళ్లారు.. కానీ అదృష్టం కొద్ది బతికిపోయారు.. కానీ క్యాన్సర్ తో మాత్రం పోరాడి ఓడిపోయారు.  ముతప్ప రాయ్,కర్ణాటకలోని అగ్ర కులాల్లో ఒకటైన బంత్ కమ్యూనిటీ నుంచి వచ్చాడు.    

 

2000వ సంవత్సరంలో దుబాయ్ ప్రభుత్వం ముతప్ప రాయ్‌ను భారత్‌కు అప్పగించింది. దీంతో కొన్ని నెలలు అతను సెంట్రల్ జైల్లో ఉన్నాడు. నిన్న ఆయన బ్రెయిన్ క్యాన్సర్ తోకన్నుమూశారు.  సాధారణంగా  జవాన్లు, పోలీసులు అమరులైనప్పుడు గాల్లోకి కాల్పులు జరిపి చివరగా గౌరవ వందనం చేసే విషయం తెలిసిందే. అయితే ఈ సంప్రదాయాన్ని ఓ డాన్ అంత్యక్రియల్లో పాటించారు.  ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన అనుచరులు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.ఈ నేపథ్యంలో బిడది పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ మాట్లాడుతూ, ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అందరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.  ఆ తర్వాత ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: