వైయస్ జగన్ పరిపాలన విధానం చాలా డిఫరెంట్. ముఖ్యంగా గత చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన చేస్తే పనులు తక్కువ పబ్లిసిటీ ఎక్కువ. వైయస్ జగన్ మాత్రం ఎక్కడ పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా పని జరిగిందా లేదా అన్న దాన్ని పట్టించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఎక్కడా కూడా పబ్లిసిటీ కార్యక్రమాలకు ఎక్కువ తావివ్వకుండా మంత్రుల చేత కథ మొత్తం నడిపిస్తున్నారు. కరోనా వైరస్ లాంటి విపత్తు సమయంలో ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలను ప్రజలకు మంత్రుల చేత దగ్గరుండి సూచనలు సలహాలు తీసుకునే వారి చేత పనులు చేయిస్తున్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో సైతం జగన్ రాజకీయం కోసం, సానుభూతి కోసం ఎక్కడ పాకులాడకుండా బాధితులకు భరోసా ఇచ్చి తన బాధ్యతలు నిర్వహించి మిగతా పనులను మంత్రుల చేత చేయించారు.

 

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్ అనుసరిస్తున్న విధానం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కి ఉన్న తేడా గురించి స్పష్టంగా చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్టణం లో వచ్చిన హుదూద్ టైంలో అవసరం లేకపోయినా కూడా వచ్చి వారానికి పైగా లేనిపోని హడావుడి చేశారు. దాని వల్ల పనులు జరగకపోగా అధికారులు, నాయకులు అంతా బాబు చుట్టూ తిరిగారు. ఇక తిత్లీ తుఫాన్ శ్రీకాకుళంలో వస్తే కూడా బస్సుల మీద తాను సహాయం చేస్తున్న పోస్టర్లు వేయించుకున్న సీఎంగా బాబుని చెబుతారు. అదే సమయంలో ప్రజలకు ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయాల్సి వచ్చే అధికారులు చాలా లేట్ చేసేవారు.

 

ఎందుకు అంటే చంద్రబాబు వచ్చాక మాత్రమే పనులు ప్రారంభించాలని అనేవారు. కానీ జగన్ పనితనం చాలా డిఫరెంట్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో బాధితునికి కోటి రూపాయలు సాయం అందించారు. ఇంత‌టి పెద్ద మొత్తం సాయం చేస్తున్నపుడు ముఖ్యమంత్రి తానే అక్కడ ఉండి ఫోటోలు తీయించుకుని ప్రచారం చేసుకోవచ్చు. కానీ జగన్ మాత్రం వాటికి తావివ్వకుండా మంత్రుల చేతుల మీదుగానే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయించడం గ్రేట్ అని అంటున్నారు. ఈ విషయంలో జగన్ చాలా అతి విశ్వాసం గా వ్యవహరిస్తున్నాడు అన్న వాళ్ళకి తన మంత్రుల చేత మొత్తం పనులు చేయించి బాధితులకు ధైర్యం చెబుతూ తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిరూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: