చిన్న వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ వైరస్ దెబ్బకి భయంకరమైన ప్రాణనష్టం అదే విధంగా ఆర్ధిక నష్టం చూశారు. ప్రపంచానికి అగ్రరాజ్యం అని పిలవబడే అమెరికా అయితే ఈ వైరస్ దెబ్బకి విల విల లాడి పోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వైరస్ విషయంలో చైనా యావత్ ప్రపంచాన్ని మోసం చేసిందని అభిప్రాయం రోజు రోజుకి బలంగా అంతర్జాతీయస్థాయిలో వినబడుతుంది. ఈ నేపథ్యంలో చైనా దేశంలో నుంచి బయటపడాలని పలు భారీ కంపెనీలు కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి చేయడం జరిగింది.

 

ముందుగా అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి చెందిన బడా కంపెనీలు అని చైనా దేశం నుండి వెనక్కి రావాలని పిలుపు ఇవ్వటంతో పాటు భారీ ఆఫర్లు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో అమెరికా దేశానికి చెందిన పలువురు ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లు అయినా లావా ఇంటర్నేషనల్ చైనాకి గుడ్ బై చెప్పింది. చైనాలోని తమ ఆఫీసులని భారత్ కి మార్చబోతున్నట్టు ప్రకటించింది. దీనితో వచ్చే ఐదేళ్ల కాలంలో ఇండియా లో రూ. 800 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు తెలిపింది. ఇంకా మరి కొన్ని దేశాలకు చెందిన చైనా నుండి బయటకు వస్తున్న కంపెనీలకు ఇండియా ఇప్పుడు ఒక మార్గం గా కనిపిస్తుంది.

 

ఒకవైపు లాక్ డౌన్ కారణంగా కుప్పగూలిపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయటం మరోవైపు కొత్తగా పెట్టుబడులతో దేశంలోని వచ్చే కంపెనీలకు భారీగా భూములు కేటాయించడం అనే జంట లక్ష్యాలతో భారత కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రప్రభుత్వాలని అప్రమత్తం చేస్తూ విదేశీ కంపెనీలని ఆకర్షిస్తుంది. దీంతో చైనా కరోనా వైరస్ విషయంలో అట్టర్ ఫ్లాప్ కాగా ఇండియా మాత్రం ఈ పరిణామాన్ని సూపర్ హిట్ గా  మలుచుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: