ఒక యువకుడు తన ప్రేమ ఒప్పుకోలేదు అన్న కోపంతో ఒక యువతికి  అసభ్య రీతిలో మెసేజ్స్ పంపించేవాడు. అంతేకాకుండా ఫోటోలను మార్పింగ్ చేసి మీ బంధువులకు కూడా పంపుతాను అంటూ బెదిరించి బయపెట్టేవాడు. ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అచ్చం పల్లి గ్రామానికి చెందిన హరీష్ కుమార్ హైదరాబాద్ లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక ఉద్యోగం చేయడం కంటే ముందు 2017 వ సంవత్సరంలో ఘట్‌కేసర్ ‌లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించాడు.

 


ఈ తరుణంలోనే అదే కాలేజీలో M.Tech చదువుతున్న యువతి అతనికి పరిచయం అయ్యింది. ఏదో ఒక కారణంతో ఆ యువతికి నిత్యం ఫోన్ చేసి మాట్లాడేవాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడంతో ఆ యువతి మాట్లాడేది. ఈ తరుణంలోనే హరీష్ కుమార్ తనను ప్రేమించాలని యువతిని కోరడం జరిగింది. కానీ ఆ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదు. ఇక అప్పటి నుంచి హరీష్ తో ఆ యువతి మాట్లాడటం మానేసింది.

 

ఇక దీనితో ఆ యువతిపై హరీష్ కోపం పెంచుకుని అసభ్య తీరులో మెసేజ్స్ పంపుతూ అమ్మాయిని వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా తన వాట్సప్ స్టేటస్ లో యువతిని కించపరిచేలాగా పోస్ట్ లు పెడుతూ నిత్యం వేధించేవాడు. అలాగే నిత్యం ఫోన్ చేసి తనను ప్రేమించాలని లేకపోతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేస్తా అని బెదిరించాడు. దీనితో యువతి పోలీసులను సంప్రదించడంతో హరీష్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోలీసు అధికారులు హరీష్ పై పోలీస్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఆ యువతీ తెలివితో పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతికి ఉపశమనం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: