చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతకాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర దేశాలతో పోలిస్తే అగ్ర రాజ్యం అమెరికాపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. గతంలో పలుమార్లు చైనాపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్ చైనాతో తెగదెంపులు దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే చైనాతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని అన్నారు. 
 
తాజాగా అమెరికా చైనా దేశానికి భారీ షాక్ ఇచ్చింది. చైనా నుంచి అమెరికాకు వచ్చే అమెరికన్ కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు వైట్ హౌజ్ అధికారులు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యవహారంలో చైనాపై అమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. చైనాతో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం వల్ల 500 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని తెలుస్తోంది. 
 
ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా లేనని చెప్పారు. చైనా మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు. ట్రంప్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని చెబుతున్నారు. చైనాలో మాత్రం అమెరికన్ కంపెనీలు ఉండటానికి మాత్రం వీలు లేదని వైట్ హౌజ్ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికన్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాల్సి ఉంది. 
 
వైట్ హౌజ్ అధికారులు చైనా నుంచి అమెరికాకు వచ్చే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పిస్తామని చెబుతున్నారు. వైట్ హౌస్ అధికారులు పన్ను రాయితీలతో పాటు కంపెనీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. మరోవైపు భారత్ తో అమెరికా సైనిక సంబంధాలు మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. అమెరికాలోని ఓ సెనేటర్ దీనికి సంబంధించిన 18 అంశాల ప్రణాళికలను ఆవిష్కరించారు. కరోనా వైరస్ గురించి చైనాను జవాబుదారీ చేయాలని అందులో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: