రైల్వే స్టేషన్లకు గత ఐదేళ్ల నుంచి స్వర్ణయుగం వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు భారీ ఎత్తున కల్పించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఎంత దారుణంగా దేశంలో రైల్వే స్టేషన్ లు  ఉండేవో  అందరికీ తెలిసిన విషయమే. టాయిలెట్ సరిగా ఉండకుండా ప్లాట్ఫారమ్లు సరిగా ఉండకుండా... రైల్ ఆగే ప్లాట్ ఫార్మ్ కు వెళ్లాలంటే పరిగెడుతూ వెళ్లడం లాంటివి జరిగేది. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఓ  వైపు లిఫ్టులు మరోవైపు ఎస్కలేటర్ లు.. ఎంతో  నీట్ గా ఉండే టాయిలెట్స్.. ఆహారంలో నాణ్యత కూడా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. 

 


 ఒక రకంగా చెప్పాలంటే భారత రైల్వే వ్యవస్థను లుక్కు క్వాలిటీ  పూర్తిగా మార్చేశారు అని చెప్పవచ్చు. అయితే రాబోయే రోజుల్లో రైల్వే స్టేషన్లు మరింత మెరుగు పడపోతున్నాయి అని తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగానే రైల్వేస్టేషన్లు ఒకేసారి కాకుండా దశలవారీగా కొన్నికొన్ని మెరుగ్గా  మార్చాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఎలాగైతే ఎయిర్ పోర్ట్ లో కావలసిన దానికంటే ఎక్కువ స్థలాలు సేకరణ చేసి వాటిని ప్రైవేట్ సంస్థలకు ఇస్తారో అదే తరహాలో రైల్వే స్టేషన్లకు సంబంధించిన స్థలాలు... ప్రైవేట్ కాంప్లెక్స్ ల  కోసం ఇచ్చి తద్వారా వచ్చిన ఆదాయాన్ని రైల్వేస్టేషన్లో మెరుగుపర్చడానికి ప్రయత్నం చేస్తుంది కేంద్రం. 

 

 ప్రతి  రైల్వే స్టేషన్ కి సంబంధించిన స్థలాలను ప్రైవేటు కాంప్లెక్స్ లకు నిలయంగా  మారిపోతుంది కాబట్టి రైల్వేస్టేషన్లు తీరు మొత్తం మారిపోతుంది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రైల్వే స్టేషన్లను బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం దేశ వ్యాప్తంగా ఏకంగా 300 రైల్వే స్టేషన్లకు మెరుగైన సదుపాయాలు రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: