ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ..జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలని చూస్తున్న చంద్రబాబుకు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా తోడైనట్లే కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుతో పాటు కన్నా కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల అయితే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో బాబు-కన్నాలు ఒకే లైన్‌లోనే వెళుతున్నట్లు అర్ధమవుతుంది. టీడీపీ ఏవైతే విమర్శలు చేస్తారో, కన్నా కూడా ఇంచుమించు అదేవిధంగా మాట్లాడుతున్నారు.

 

తాజాగా కూడా ప్రకాశం జిల్లాలో మరణించిన వ్యవసాయ కూలీలుకు కూడా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మాదిరిగానే వారికి కూడా కోటి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వారికి 5లక్షలు సాయం చేసింది. కాకపోతే విశాఖ మాదిరిగా సాయం చేయకపోవడానికి కారణం కూడా చెప్పింది. అది ప్రైవేట్ కంపెనీ తప్పిదం వల్ల జరగడంతో పెద్ద మొత్తంలో సాయం అందిందని వైసీపీ నేతలు చెప్పారు.

 

ఇక ఆ విషయాన్ని పట్టించుకోకుండా రాజకీయం చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్న, చంద్రబాబు-కన్నాలు మంత్రం కోటి సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా న్యాయమైనది కాదంటున్నారు. మృతుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, పొలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా డిమాండ్లు చేసి బాధితులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నట్లు కనపడుతున్నారు.

 

అయితే ఇదే సమయంలో టీడీపీ నేతలు రాజధాని అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, అక్కడి వారిని కూల్ చేయడానికి కోటి సాయం అందించారని, అదే అమరావతి పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా వాసులకు అంత సాయం అందించట్లేదని విమర్శలు చేస్తున్నారు. అందుకే విశాఖలో ఘటన జరిగిన వెంటనే జగన్ హుటాహుటిన అక్కడికి వెళ్లారని, కానీ పక్కనే ఉన్న ప్రకాశంకి రాలేదని మండిపడుతున్నారు. జగన్ పక్షపాత పాలనకు ఇదే నిదర్శనమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: