జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు. కానీ జగన్ మాత్రం 2024 టార్గెట్ పెట్టేసుకున్నారు. ఈ ఎన్నిక కాదు, ఈ గెలుపు కాదు 2024లో గెలిస్తేనే వైసీపీకి అసలైన విజయం దక్కినట్లు అన్నది జగన్ పొలిటికల్  ఫిలాసఫీగా ఉంది. దాంతో దూకుడుగా ఆయన ఏపీలో పాలన చేస్తున్న్నారు. ఆయన ఆలోచనలకు కరోనా అడ్డు కావడం లేదు. విపక్షాలు అసలు అడ్డుకావడంలేదు. ఆయన చూపు మరో నాలుగేళ్లలో జరిగే సాధారణ ఎన్నికల మీదే ఉంది.

 

జగన్ ప్రధానంగా మూడు వర్గాలను టార్గెట్ చేశారు. మహిళలు, రైతులు, పేదలు. ఇలా జగన్ వీరి మీదనే ద్రుష్టి పెట్టి తన పధకాలను అందిస్తున్నారు. వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. ఖజానాలో డబ్బులు లేకపోయినా పధకాలు మాత్రం ఆగకూడు. ఇదే జగన్ ఆలోచన‌గా ఉంది. దానికోసం ఆయన అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.  వీటన్నిటికీ  డబ్బులు ఎలా తేవాలా అని కిందా మీద పడుతున్నారు.

 

తాను ప్రజలకు ఇచ్చిన హామీలు, నవరత్నాలు సవ్యంగా అమలు చేయాలని జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారు. వాటిని పూర్తి చేసి జనంలోకి వెళ్తే వచ్చే  ఇంపాక్ట్ వేరు. అదే విధంగా జగన్ పోలవరం కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో మిగిలిన సాగునీటి ప్రాజెక్టులకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. మరో వైపు విశాఖను అద్భుతమైన రాజధానిగా చేయాలనుకుంటున్నారు.

 

ఆ విధంగా 2024 నాటికి రాష్ట్రాన్నిఒక గాడిలో పెట్టాననిపించుకుంటే జనం తన పార్టీని తప్పకుండా ఆదరిస్తారని కూడా జగన్ భావిస్తున్నారు. జగన్ ఈమెరుపు  వేగంతో వెళ్తూంటే  టీడీపీ వంటి పార్టీలు చేస్తున్న పిడి  వాదనలు, పెను  వివాదాలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. తన లక్ష్యం కోసమే అన్నట్లుగా  ఆయన పదే పదే  పరితపిస్తున్నారు.

 

ఇదే ఇపుడు విపక్షాలకు ఇబ్బందిగా  ఉంది. జగన్ అన్ని హామీలు నెరవేరిస్తే  ప్రజలు  మళ్ళీ వైసీపీకే పట్టం కడితే తమ గతేం కాను అన్న బాధ కూడా వారిలో ఉంది. వైసీపీ దూకుడు ముఖ్యంగా టీడీపీకి గట్టి  షాక్ ఇచ్చేలా ఉందిట. అయితే ప్రతిపక్షంలో ఉండడంతో టీడీపీ జోరు పెంచలేకపోతోంది. పైగా మునుపటి జోష్ పార్టీలో కనిపించడంలేదు. దాంతో జగన్ 2024 ఎన్నికల  టార్గెట్ ను రీచ్ కాకుండా ఎలా అడ్డుకోవాలి అన్నది టీడీపీ బిగ్ టాస్క్ గా మారిందని ని అంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: