లోకంలో ఇప్పుడు ఆడ, మగ అనే తేడాలే లేవు.. ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఆడవాళ్లు పీకల దాక తాగి క్షేమంగా ఇంటికెళ్లుతున్నారు.. అంతే కాకుండా ఫుల్‌గా మద్యం సేవించి మగవారికంటే ఎక్కువగా హంగామా సృష్టిస్తున్నారు.. నేటికాలం మగువ ఎందులోను తీసిపోదని నిరూపిస్తున్నారు.. ఇక ఇంతకంటే ఏం కావాలి.. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుంది అనడానికి.. ఇప్పటికే తాగి రోడ్లపై ఎన్నో సార్లు భీభత్సాన్ని సృష్టంచిన నేటితరం యువతులు, మరికొంత మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వారిబాటలోనే నడుస్తున్న యువతులు తల్లిదండ్రుల గౌరవాన్ని తాగిన మత్తులో రోడ్లమీద కాపాడుతున్నారు.. ఇప్పుడే ఇలాగా ఉంటే ముందు తరం వాళ్లు ఇంకెత ఫాస్ట్‌గా మారుతారో..

 

 

ఇకపోతే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిచోట మందుబాబులు మత్తులో జోగుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ లిక్కర్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అసలు కరోనా అనేది ఒకటుంది.. ఇది ప్రాణాలను దయ లేకుండా ఫలహారంలా తీసుకుంటుందని మరచిపోతున్నారు.. భయం అనేది మరచి ప్రవర్తిస్తున్నారు.. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మద్యం మత్తులో ఓ యువతి హల్‌ చల్ చేసింది. ఏమాత్రం సిగ్గులేకుండా, ఇన్నాళ్లకు దొరికిన మద్యాన్ని వేలుపెడితే అందే వరకు సేవించి పూర్తిగా తన మీద తాను కంట్రోల్ కోల్పోయి కారులో అతి వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి..

 

 

ఇక మద్యం మత్తులో జోగుతున్న ఆ యువతిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్దలానికి చేరుకుని సదరు యువతిపై కేసు నమోదు చేశారు. ఇకపోతే మద్యం ధరలు ఎంతగా పెంచిన తాగుబోతులు మాత్రం వెనక్కు తగ్గేది లేదని, తాగడంలో మాత్రం మార్పు రాదని ఫుల్‌గా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఎదుటివారి ప్రాణాలు కూడా తీస్తున్నారు.. ఇక యువతులు ఇలాంటి పరిస్దితుల్లో రోడ్లమీద ఉంటే దోపిడీలు, రేపులు కాకుంటే ఏం అవుతాయి.. యువతులు స్వేచను ఇలా దుర్వినియోగం చేయడాం ఏంటని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: