లోకం ముందు ప్రకృతి అతిపెద్ద సవాల్ పెట్టింది.. ఒకరకంగా ఇది పాలకులకు పరీక్ష లాంటిది.. ప్రజలకు శిక్షలాంటిది.. ఎందుకంటే ఈ వైరస్ వల్ల మిగతా దేశాల, రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం.. మొదట ఏపీ విషయానికి వస్తే ఎన్నో ఆశల మధ్య జగన్ సీయం పదవిని చేపట్టారు.. అసలే అప్పులు.. అందులో గత ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్న ప్రజలు.. ఇలా రకరకాల సమస్యల మధ్య జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో పడ్డాడు.. ఇంతలోనే కరోనా అనే మాయదారి వైరస్ వచ్చి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోలేని విధంగా సమస్యను సృష్టించింది..

 

 

ఈ సమయంలో ప్రజలకోసం ఆలోచిస్తే, అభివృద్ధికి నిధులు ఉండవు, చేసిన, చేస్తున్న అప్పులు తీరవు.. అలాగని వారిని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో పదవి దక్కదు.. మరి ఎంతో ఆలోచనతో, ముందుచూపుగా వ్యవహరిస్తూ, రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, రాష్ట్రంలోని ప్రజలను మెప్పిస్తూ ముందుకు వెళ్లడం కత్తిమీద సాములాంటిదని చెప్పవచ్చు.. కానీ విధిలేని పరిస్దితుల్లో ధరల పెంపుదల అనే వాత పెట్టక తప్పదు.. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటికే ఐదు సంవత్సరాల పదవికాలాన్ని పూర్తిచేసుకున్న కేసీయార్.. రెండో సారి ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజారిటీని సాధించాడు..

 

 

ఇక గత పదవికాలంలో ఇచ్చిన హామీలు, రెండో సారి పదవి చేపట్టాక అమలు చేయవలసిన పధకాలు, మూడోసారి ముచ్చటగా సీయం పీఠం చేజారిపోకుండా చేయవలసిన పనుల తాలూకూ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న సమయంలో ఆర్టీసీ సమ్మే అనే హాడావుడిలో కొంత తర్జభర్జనలు జరిగి.. ఆలోచనలేని అర్భకులు చేసిన పనుల వల్ల తెలంగాణ ఆర్టీసికి నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రాణాలు కూడాపోయాయి.. బస్సు చార్జీలు కూడా పెరిగాయి..

 

 

నిజానికి ముందు చూపు లేకుండా, సరైన అంచనాలు లేకుండా సమ్మే చేయడం వల్ల ఆ నష్టం ప్రజలపై పడింది.. కేవలం నెలరోజులు బస్సులు బంద్ ఉంటేనే ధరల బాదుడు ఈ రకంగా ఉంటే.. ఈ కరోనా వల్ల ఇన్నిరోజులు లాక్‌డౌన్ ప్రకటించడంతో వచ్చిన నష్టాన్ని ఎలా పూడుస్తారు.. ప్రజల నెత్తిన ఎంతగా ధరల భారం పెడతారో అర్ధం కానీ పరిస్దితి.. ఇనాళ్లు వచ్చిన జీతంతో జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చిన పేద మధ్య తరగతి ప్రజలు.. ఈ కరోనా వల్ల కోలుకోని నష్టాన్ని చవిచూసారు.. అందులో ఉద్యోగాలు పోయాయి, జీతాల్లో కోతలు పడ్దాయి.. ఇలాంటి పరిస్దితుల్లో ప్రభుత్వం తన ఖాజాన కోసం ఆలోచిస్తే మరి ప్రజల కష్టాలు పట్టించుకునేది ఎవరనే ప్రశ్న తలెత్తుతుంది..

 

 

ఇప్పటి వరకు తెలంగాణాలో జరిగిన అభివృద్ధి ఏంటో అందరికి తెలిసిందే.. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయి అని అనుకున్న వారందరు ఒక్క సారి ఆలోచించుకోండి మీ బ్రతుకులు మీరు చేస్తున్న అప్పులతో బాగుపడ్దాయో, ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో కూరుకుపోతున్నాయో అని కొందరు వాదిస్తున్నారు.. ఇక ప్రజలకు ఆదాయం ఉంటేనే పెంచిన ధరల భారం వారికి తెలియదు.. అదే ఆదాయం చాలీ చాలకుండా ఉండి, బ్రతకడానికి సరిపడ లేనప్పుడు వారి రక్తాన్ని పీల్చే జలగల్లా పాలకులు తోస్తారు.. అందుకే ఒకరకంగా ఇప్పుడున్న ముప్పు వల్ల ధనికులు, రాజకీయ నాయకులకు జరిగే నష్టం ఏం లేదు..

 

 

ఇప్పటికే కావలసినంత సంపాదించుకున్నారు కాబట్టి, ఎటొచ్చి పేద మధ్యతరగతి బ్రతుకులే నిప్పులో ఉప్పులా చిటపటలాడుతూ, చివరికి చితికి పోవలసిందే అని ముందు చూపు ఉన్న కొందరు నెటిజన్స్ మధనపడుతున్నారట.. ఇక ప్రజలకు ఎదురయ్యో కష్టాలనుండి పాలకులే కాపాడుతారో, దేవుడే గట్టెక్కిస్తాడో అని దీనంగా చూసే వారుకూడా ఉన్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: