ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ మధ్య విమర్శల పర్వం మరీ ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీలో కీలక నేతగా ఇక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతూ తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు  చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతుంటారు. 

 


 ఆంధ్ర రాజకీయాల్లో ని ప్రతి విషయంలో తనదైన మార్కు వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తూ సోషల్ మీడియా వేదికగా చెలరేగి పోతుంటారు విజయసాయిరెడ్డి. అయితే ప్రస్తుతం తాజాగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి  సర్కార్ భూ సేకరణ చేస్తున్న విషయం తెలిసిందే. పేదలకు సత్వరంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో.. దీనికి సంబంధించిన అన్ని చర్యలు సత్వరంగా జరిగేలా చూస్తుంది. ఇదే సమయంలో అటు టీడీపీ మాత్రం దీనిపై విమర్శలు చేస్తూనే వస్తోంది. 

 

 అయితే తాజాగా దీనికి సంబంధించి వైసీపీ కీలకనేత పార్లమెంటరీ సభ్యుడు అయిన విజయ్ సాయి రెడ్డి టీడీపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్  వేదికగా మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తయితే టీడీపీ  పార్టీకి పుట్టగతులు ఉండవు అనే భయం ప్రస్తుతం చంద్రబాబు గారికి పట్టుకుంది అని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. అందుకే భూసేకరణ విషయంలో అడ్డు  పడాలన్న ఉద్దేశంతో జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు . అయితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు స్టే విధించడం  ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో  ఎంత ఉత్సాహం నింపింది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: