ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ మహమ్మారి విజృంభిస్తు విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోవడంతో పాటు.. వైరస్  కారణంగా చనిపోతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగి పోతుంది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం లభించడం లేదు. ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వైరస్కు ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్  కూడా అందుబాటులోకి రాకపోవడం మరింత ఆందోళనకు దారి తీస్తోంది. 

 

 అయితే ఈ వైరస్ మొదట వెలుగులోకి వచ్చి విలయతాండవం చేసిన చైనా దేశంలో ప్రస్తుతం ఈ వైరస్ తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని చెబుతోన్నారు అధికారులు . ప్రపంచం మొత్తం కరోనా  వైరస్తో వణికిపోతుంటే... ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. అక్కడ కరోనా  వైరస్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో నిబంధనలను క్రమక్రమంగా ఎత్తివేస్తుంది  అక్కడి ప్రభుత్వం. 

 

 

 తాజాగా చైనా రాజధాని ప్రాంతమైన బీజింగ్లో బయటకి వెళ్ళే వారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు అంటూ అధికారులు స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. బీజింగ్  సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ ఈ  కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది... అయితే ఎవరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు అంటూ తెలిపిన  అధికారులు... సామాజిక దూరం పాటించడం మాత్రం తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు. వాతావరణం బాగున్నప్పుడు బయట ప్రాంతాల్లో వ్యాయామం  చేసుకోవడం వల్ల కూడా మెరుగైన ఆరోగ్యం సమకూరుతుంది అంటూ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: