దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పేషెంట్లను గుర్తించి వారిని క్వారంటైన్ కు  తరలిస్తున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ లో  ఉంచి  వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చికిత్స చేస్తున్నారు అధికారులు. అయితే క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు బుద్దిగా  ఉండాల్సింది పోయి గొడవలకు పాల్పడుతున్నారు చాలామంది. దీంతో క్వారంటైన్ కేంద్రాలు కాస్త వివాదాలకు.. గొడవలకు సెంటర్ గా మారిపోతున్నాయి. తాజాగా ఓ క్వారంటైన్ కేంద్రంలో ఇలాంటి ఘటనే  జరిగింది.. కరోనా అనుమానితుల  క్వారంటైన్  ఉండగా.. వారి మధ్య తోపుసలాట జరిగి  కొట్టుకున్నంత వరకు వెళ్ళింది. 

 

 

 బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది... వివరాల్లోకి వెళితే... బీహార్లోని సమస్తిపూర్ జిల్లా పుల్హారా టౌన్ లో ఉన్న పాఠశాలలను తాత్కాలికంగా కరోన అనుమానితుల  కోసం క్వారంటైన్ సెంటర్గా మార్చారు అధికారులు. ఈ  సెంటర్లో 150 మందిని  ఐసోలేషన్ లో ఉంచారు. అయితే ఈ  కేంద్రంలో 150 మందిని ఐసోలేషన్ లో పెట్టారు అన్న మాటే కానీ వీరికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు ప్రభుత్వం. అయితే తాజాగా ఈ క్వారంటైన్  కేంద్రానికి ఒక వాటర్ ట్యాంకర్ వచ్చింది... ఇక్కడున్న వారందరూ సామాజిక దూరం పాటిస్తూనే నీళ్లు పట్టుకుని వెళుతున్నారు. 

 

 

 ఇంతలో నీళ్లు పట్టుకుని విషయంలో ఓ చిన్న గొడవ మొదలైంది. అది క్రమక్రమంగా పెరిగి  చేయి చేసుకునేంతవరకు వెళ్ళింది. దీంతో అక్కడున్న వారు గట్టిగా అరుస్తూ బక్కెట్లు బిందెలు అక్కడ చేతికి ఏది అందితే దాంతో కొట్టుకున్నారు. దీంతో 150 మంది ఉన్న ఐసోలేషన్ కేంద్రం కాస్త రణరంగంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక విషయం ప్రభుత్వం వరకు వెళ్లడంతో వెంటనే స్పందించిన అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.

మరింత సమాచారం తెలుసుకోండి: