నిజానికి చాలా మందికి శారీరకంగా కలిసేటప్పుడు కండోమ్ ఉపయోగించడంలో చాలామందికి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. నిజానికి వాటికి వాడకం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా...? లేకపోతే తమ వారిని సంతోషపరిచలేమో అన్న సందేహాలు చాలానే వస్తూ ఉంటాయి. అయితే ఒకసారి కొందరు కండోమ్ ఒకసారి వినియోగించింది మళ్లీ వినియోగించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పు. అది ఎవరైనా సరే స్త్రీలైనా, పురుషులైనా. ఒక్కసారి మాత్రమే వినియోగించాలి. కాకపోతే వాటిని మళ్ళీ మళ్ళీ వినియోగిస్తే లైంగిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి సురక్షితమైన శృంగారానికి కండోమ్ బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే కొందరికి ఈ కండోమ్ ఉపయోగించడం చాలా మందికి ఇష్టం ఉండదు. దానివలన పూర్తి అనుభూతిని అందుకోలేమో అని వారి వాదన. అయితే ఇలాంటి నమ్మకాలను పక్కనపెట్టి కండోమ్ ఉపయోగించడం ఉత్తమం అని నిపుణులు తెలియజేస్తున్నారు.

 


అందరికీ తెలిసినట్లుగానే కేవలం పురుషుడు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా కండోమ్స్ ప్రత్యేకంగా మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే చాలామందికి కండోమ్ ఇద్దరిలో ఒకరు ఉపయోగిస్తే సరిపోతుందా..? లేకపోతే ఇద్దరు వాడాలనే అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి సమాధానం ఇద్దరిలో ఎవరైనా సరే ఒకరు వాడితే సరిపోతుందని చెప్పవచ్చు. ఒకవేళ ఇద్దరూ వాడితే కండోమ్ చిరిగి పోవడం కానీ, ఏదైనా జారి పోవడం లాంటివి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు.

 


ఇకపోతే ఆడవారు కండోమ్ వాడకంలో చాలా మంది స్త్రీలకు కొన్ని అనుమానాలు ఉంటాయి. పొరపాటున కండోమ్ జారీ గర్భాశయం లోపలికి వెళితే ఎలాంటి సమస్యలు వస్తాయో అని కంగారు పడుతుంటారు. అయితే ఇలాంటి సందేహాలు అవసరం లేదని నిపుణులు తెలుపుతున్నారు. దీనికి కారణం ఆడవారికి తయారుచేసిన కండోమ్ నిర్దేశిత పరిమాణంలో తయారు చేయబడతాయి కాబట్టి అవి గర్భాశయంలోకి వెళ్లే అవకాశం ఉండదని వారు తెలియజేస్తున్నారు. అయితే వాటిని ధరించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలని కూడా వారు చెబుతున్నారు. ఇక స్త్రీలు పీరియడ్ సమయంలో కూడా ఈ ఫిమేల్ కండోమ్ వాడే వారు నిస్సందేహంగా వాడొచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: