డిమాండ్ నెర‌వేర్చ‌డ‌మో కావ‌చ్చు.... వాస్త‌వ ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా పేర్కొన‌వ‌చ్చు కానీ...  కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొద్దికాలంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేవ‌నెత్తున్న అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిష్క‌‌రించింది. ముఖ్య‌మంత్రిగా కే‌సీఆర్ చేసిన డిమాండ్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌ర్కారు నెర‌వేర్చింది. రాష్ట్రాలు రుణం తీసుకునే ప‌రిమితిని మూడు నుంచి అయిదు శాతానికి పెంచుతున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. త‌ద్వారా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఊర‌ట‌నిచ్చే ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త కొద్దికాలంగా తెలంగాణ సీఎం క‌సీఆర్ ఇదే విష‌యాన్ని నొక్కి చెప్తున్న సంగ‌తి తెలి‌సిందే.

 

ఆదాయం లేకపోవటంతో పీఎంతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల్లో పలు రాష్ట్రాల సీఎం లు ఈ పరిమితిని పెంచాలని కోరారు. దీంతో కేంద్రం రుణాల పరిమితిని పెంచింది. రాష్ట్రాల ఓడీని సైతం 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచింది. ఆత్మ నిర్భ‌ర్ ప్యాకేజీలో భాగంగా అయిదో ద‌శ ఆర్థిక అంశాల‌ను ప్ర‌క‌టించిన ఆర్థిక‌ మంత్రి నిర్మ‌లా.. రుణ ప‌రిమితిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల త‌ర‌హాలోనే కేంద్రం కూడా త‌మ ఆదాయంలో తీవ్ర త‌రుగుద‌ల ఎదుర్కొంటోంద‌న్నారు. అయినా కానీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం స‌హ‌కారం అందిస్తూనే ఉంద‌న్నారు. జీఎస్‌డీపీలోని 3 శాతం ఆధారంగానే 2020-21 సంవ‌త్స‌రానికి రాష్ట్రాల‌కు 6.41 ల‌క్ష‌ల కోట్ల రుణం తీసుకునేందుకు సీలింగ్ పెట్టారు.  దీంతో ఆయా రాష్ట్రాలకు ఈ ఏడాది మార్చిలో 75 శాతం రుణం ఇచ్చేసిన‌ట్లు చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 14 శాతం మాత్రం రుణం తీసుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఇంకా 86 శాతం రుణం అలాగే మిగిలి ఉంద‌న్నారు.  ఈ నేప‌థ్యంలో రుణ ప‌రిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. 

 

కాగా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అప్పు తీసుకునే సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిమాండ్ చేస్తున్న సంగ‌తి తె‌లిసిందే. రాష్ట్రాల అవ‌స‌రాలు తీరాలంటే అప్పులు కావాల్సిందేన‌ని పేర్కొంటున్న ఆయ‌న ఈ మేర‌కు ఎఫ్ఆర్‌బీఎంం ప‌రిమితి పెంచాల‌ని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: