కొంతమంది మనుషులు కొన్ని కొన్ని సార్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు అనే విషయం తెలిసిందే. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అయి పోతూ... ఎంతో వింతగా ప్రవర్తిస్తూ పక్కవాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు. ఓ వ్యక్తి అలాంటిదే చేసాడు. తన భార్య తనకు స్పైసీ ఫుడ్ వండి పట్టలేదు అనే కారణంతో ఏకంగా తాము ఉంటున్న అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందికి దూకబోయాడు. ఈ ఘటన అపార్ట్మెంట్ వాసులందరికీ షాక్ కి గురిచేసింది. ఇంతకీ ఏం జరిగింది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. భార్య  స్పైసీ ఫుడ్ వండలేదు అని బాల్కనీ నుంచి భర్త దూకిన ఆశ్చర్యకరమైన ఘటన గుజరాత్ అహ్మదాబాద్లోని చాంద్ కేడాలో  చోటు చేసుకుంది. 

 

 

 వాతావరణం చల్లగా ఉంది నాకోసం ఏదైనా స్పైసీ ఫుడ్ చేసి ఇవ్వు... లాగించేస్తాను చాలా ఆకలిగా ఉంది అంటూ భర్త భార్యకు చెప్పాడు భర్త హర్మెష్ . ఇక అప్పటికే ఇతర పనుల్లో బిజీగా ఉన్నా అతని భార్య... ఇప్పుడు కుదరదు అని... తర్వాత చేస్తాను ఇప్పుడు అయితే నేను ఏది పడితే అది తినండి అంటూ చెప్పింది. ఈ విషయాన్ని కాస్త చిరాగ్గా చెప్పింది భార్య. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన భర్త హర్మెష్ .. ప్రతి విషయంలో ఇలాగే చేస్తున్నావ్...  నేనంటే నీకు చాలా లోకువ అయిపోయాను అంటూ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను లేకపోతే నా విలువ తెలిసి వస్తుంది అంటు కోపంతో బాల్కనీ గోడ ఎక్కి దూకబోయ్యాడు. 

 

 

 ఇక ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే హుటాహుటిన పరిగెత్తుకొచ్చి... హర్మేష్  ను మందలించారు.. దీంతో అక్కడ బాల్కనీ గోడను పట్టుకుని వేలాడ సాగాడు సదరు భర్త. ఇక అక్కడి నుంచి కిందికి దూకే లేక పైకి వెళ్లలేక  మధ్యలోనే వేలాడుతున్నాడు. ఇక అపార్ట్మెంట్ వద్దకి చుట్టూ  పక్కల వారు చేరుకొని తలో  చేయి వేసి అతన్ని  పైకి లాగారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సదరు భర్త బాల్కనీ లోంచి దూకడానికి అసలు కారణం తెలిసి చుట్టుపక్కల వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. ఇక ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకొని... ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: