రెండు తెలుగు రాష్ట్రాలలో కుదిపేస్తున్న అంశం 'పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం'. కాగా ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'పోతిరెడ్డిపాడు నీటి ప్రాజెక్టు' సామర్థ్యం పెంచుతూ జీవోనెంబరు 203ను జారీ చేయటంతో తాజాగా ఈ వివాదం స్టార్ట్ అవడం మనకందరికీ తెలిసినదే. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుండి వ్యతిరేకిస్తోంది. చట్టాలకు విరుద్ధంగా నిబంధనలను అతిక్రమిస్తూ ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు అధికారులు తీవ్రస్థాయిలో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా వెంటనే ఈ ప్రాజెక్టును ఆపాల్సిందేనని పట్టుబడుతూ కోర్ట్ కి వెళ్ళటానికి కూడా రెడీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు ఏపీ ప్రభుత్వం ఎలా వాడుకుంటోందని ప్రశ్నించారు.

 

ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా తెలంగాణ బిజెపి నాయకులు సైతం ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. వెంటనే ప్రాజెక్టు ను ఆపేయాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ నాయకులంతా సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న జీవోనెంబరు 203 నిర్ణయానికి ఏపీ బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇటువంటి నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయే క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉండటంతో మోడీ విషయంలో ఇన్వాల్వ్ అయినట్టు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

కృష్ణా జల వనరులకు సంబంధించి చేపట్టాలని భావిస్తున్న ఎత్తిపోతల పథకానికి సంబంధించి డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తీసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును ఆదేశించినట్లుగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ వెల్లడించారు. అయితే ఈ విషయంలో జగన్ దూకుడు రాజకీయాలకి మోడీ బ్రహ్మాస్త్రం లాంటి షాక్ ఫైనల్ గా ఈ నీటి విషయంలో ఇవ్వబోతున్నట్లు ఢిల్లీలో టాక్. విభజన చట్టం ఆధారం చేసుకుని సరికొత్త నిర్ణయం కేంద్రం వెల్లడించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: