ప్రస్తుతం వలస కార్మికుల జీవితం ఎంత దుర్భరంగా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంత రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికులు అందరి బతుకులు ప్రస్తుతం దుర్భరంగా మారిపోయాయి. కరోనా  వైరస్ వలస కార్మికుల బతుకు చక్రాన్ని ఒక్కసారిగా కదిలించింది. దాదాపు 40 రోజుల పాటు ఉపాధి లేక పోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబ పోషణ భారమై... ఇంటికి వెళ్దాం అంటే రవాణా సౌకర్యం లేక... ఇంటిపయనం  దూరమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వలస కార్మికులు. 

 

 

ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వచ్చి  జీవనోపాధి పొందుతున్న వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు పూర్తి స్థాయిలో రైలు సౌకర్యం ఏర్పాటు చేస్తున్న తరుణంలో వలస కార్మికులు మాత్రం కాలినడకన ఇంటిదారి పడుతున్నారు. ఇంకొంతమంది వాహనంపై పరిమితికి మించి ఎక్కువమంది ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. 

 

 

 తాజాగా ఇక్కడ కనిపిస్తున్న చిత్రం వలస కార్మికులు స్థలానికి వెళ్లేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని దానికి నిలువుటద్దంగా మారిపోయింది. ఒక ద్విచక్రవాహనంపై ఏకంగా ఆరు గురు ప్రయాణం చేయడం స్థానికులను కూడా షాక్ కి గురిచేసింది. రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో ఓకే ద్విచక్ర  వాహనం  పై ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరు మెదక్ జిల్లా తూప్రాన్ లో 44వ జాతీయ రహదారిపై వెళ్తూ కనిపించగా... ఇది చూసిన స్థానికులు వీరి వాహనాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా  ఇది వైరల్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరు బెంగళూరులో పానీపూరి బండి నడుపుతూ జీవనం సాగించేవారు ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా అది కాస్తా మూతపడడంతో జీవన ఉపాధి కరువై స్వస్థలానికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: