కరోనా వైరస్ మనుషులను టచ్ చేయకుండా మందులేని ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. మార్చి నెల నుండి ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో చేసే పని ఆగిపోవటంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది పేద ప్రజలకు. బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి మరోపక్క ఇంటిలో తింటా కి కూడా పరిస్థితి కష్టంతో చెయ్యి చాచి పరిస్థితులు చాలాచోట్ల ఏర్పడ్డాయి. ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువగా ఆకలి కేకలు వినపడుతున్నాయి. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నారు.

 

ఇదే సమయంలో రోజుల తరబడి ఇంటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో జైల్లో ఉన్నట్లు ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో న్యూజిలాండ్ ప్రభుత్వం సోషల్ బబుల్.. ట్రావెల్ బబుల్ అంటూ కొత్త కాన్సెప్టుల్ని తీసుకొచ్చింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే దీని ఉద్దేశం ఏమిటంటే ప్రజలు ఎక్కువ మంది ని కలవకుండా నియంత్రించే విధంగా ఈ కాన్సెప్ట్ ని న్యూజిలాండ్ తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా ఉండాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పేరుకు బదులు న్యూజిలాండ్ ప్రభుత్వం సోషల్ బబుల్ పేరిట కొంత మందిని మాత్రమే ఎంపిక చేసుకునే విధానాన్ని తెరపైకి తెచ్చారు.

 

ఇంట్లోనే ఉంటూ బోర్ కొడుతుంది అంటున్న వారికీ  తాము ఎంపిక చేసుకున్న కుటుంబ సభ్యులు.. స్నేహితుల్ని మాత్రమే కలుసుకునేందుకు అనుమతి ఇవ్వటం. అంటే.. ఒకరు తాము ఎంపిక చేసిన వారినే కలుకుంటారు. దీంతో.. కుటుంబ సభ్యులతో పాటు.. పరిమిత సంఖ్యలో మాత్రమే బయటవారితో కాంటాక్టు ఉంటుంది. ఈ విధానం ద్వారా ఎవరు కలుసుకున్నా పాజిటివ్ కేస్ ఆ గుంపులో బయటపడితే మిగతా వారిని గుర్తించడం ఈజీ అవుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇదే విధానాన్ని బెల్జియం.. జర్మనీలు కూడా పాటిస్తున్నాయి. ఫ్రాన్సు.. ఆస్ట్రియా.. డెన్మార్క్ లలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ పది మంది మాత్రమే కలుసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే సోషల్ డిస్టెన్స్ అనే పదం పోయి సోషల్ బాబుల్ అనే సరికొత్త పదం ప్రపంచం లోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: