ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజురోజుకి దగ్గర దగ్గర రెండు వేల కేసులు ఒక్క రోజుకి నమోదవుతున్నాయి అంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో 90 వేలకు చివరగా కేసులు నమోదయ్యాయి. అంతేకాక 2,700 పైగా మరణాలు కూడా సంభవించాయి. దీన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు అహర్నిశలు పని చేస్తున్నారని చెప్పవచ్చు. వారు అంత కష్టపడుతున్న ప్రజలు మాత్రం వారి ఇష్టానుసారం బయట తిరుగుతున్నారు. దీనితో వైరస్ తగ్గుముఖం పట్టే సమస్యే లేకుండా పోతుంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ఏకంగా 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతే కాదు దేశంలో 40 శాతం మరణాలు ఆ ఒక్క రాష్ట్రంలోనే సంభవించాయి అంటే అక్కడ పరిస్థితి అర్థం పడుతుంది.

 

ఇకపోతే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు వారి సొంత రాష్ట్రాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక పట్టణాలలో నుంచి శ్రామికులను వారి సొంత ఊర్లకు పంపించేందుకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు. ఇకపోతే నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 1412 మంది వలస కార్మికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి తమ సొంత రాష్ట్రాలకు రైలులో బయలుదేరి వెళ్లారు. అంతేకాకుండా వివిధ పనులపై చిత్తూరు జిల్లాకు వచ్చి అక్కడే లాక్ డౌన్ చేత చిక్కుకుపోయిన వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్తూరు నుంచి రెండవసారి ప్రత్యేక శ్రామిక్ ద్వారా వారిని వారి స్వస్థలాలకు చేరవేయడం చేశారు. 


అయితే ఈ శ్రామిక్ ట్రైన్ ఎక్కేవారికి అందరికీ కరోనా పరీక్షలు క్షుణ్ణంగా నిర్వహించి వారిని మరోసారి స్క్రీనింగ్ చేపట్టిన తర్వాతే ట్రైన్ లోకి అనుమతించడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ చేసుకున్న తరువాతనే వారిని రైలు ఎక్కించి అందులో ప్రయాణించుటకు ఏర్పాటు చేశారు. ఇక వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి నీరు ఆహారం మొదలగునవి వారికి అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: