ప్రపంచంలోనే హిందూ దేశం.. హిందువుల అత్యధికులు ఉన్న దేశం భారతదేశం.. అయితే ఇదే దేశంలో ఉన్న ఆరు రాష్ట్రాల్లో హిందువులు ప్ర‌స్తుతం మైనారిటీలుగా ఉన్నారంటే నమ్మడం కొంత కష్టం గానే ఉంటుంది. కానీ ఇది నిజమ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇతర మతాల వారితో పోల్చుకుంటే హిందువులు త‌క్కువ సంఖ్య‌లో ఉండి మైనారిటీలో ప‌డిపోయారు. ప్ర‌స్తుతం మిజోరం, నాగాలండ్‌, మేఘాల‌య‌, సిక్కిం, అరుణాచ‌ల్‌ ప్ర‌దేశ్, జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రికొంత కాలంలోనే ప‌శ్చిమ‌బెంగాల్‌, కేర‌ళ రాష్ట్రాల్లోనూ హిందువులు మైనారిటీలుగా మారుతార‌ని చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని వారు అంటున్నారు. అనాదిగా సాగుతున్న మతమార్పిడుల వల్లనే నేడు హిందువులు మైనారిటీలుగా మారుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లాం రాజుల పాలనలో భార‌త‌దేశంలో బలవంతంగా హిందువులను ముస్లింలుగా మార్చిన చరిత్ర అందరికీ తెలిసిందే. అదే సమయంలో కొందరు హిందువులు స్వచ్ఛందంగానే ఇతర మతాల్లోకి వెళ్లారు.. వెళ్తూనే ఉన్నారు.. ఇక బ్రిటిష్ వారి రాకతో హిందువులు క్రైస్తవంలోకి మారడం కూడా ప్రారంభమైంది.

 

హిందువులు ప్రధానంగా ఈ రెండు మతాల్లోకే ఎక్కువగా మారారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో హిందువుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వారు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా హిందువుల్లో చాలా వరకు అణ‌గారిన వర్గాల నుంచి ఎక్కువ క్రైస్తవంలోకి మారుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. హిందూమతంలో ఎస్సీలకు సముచిత గౌరవం దక్కకపోవడంతోనే ఇతర మతాల్లోకి మారుతున్నారని అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా.. ఇత‌ర మ‌తాలు వారిచ్చే ప్రోత్స‌హ‌కాలు, చ‌దువు త‌దిత‌ర అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌తం మారేందుకు ఎక్కువ‌గా మొగ్గుచూపుతున్నార‌ని అంటున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.. దేశంలోని ప్ర‌ధాన పార్టీలు, పాల‌క‌కుల తీరువ‌ల్ల కూడా హిందూమ‌తం నుంచి ఇత‌ర మ‌తాల్లోకి మ‌త‌మార్పిడిలు కొన‌సాగుతున్నాయ‌ని చెబుతున్నారు. ముందుముందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: