కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలతోపాటు ఎక్కువగా ఇబ్బందులు పడింది వలస కార్మికులు. వాస్తవానికి చెప్పుకుంటే వలస కార్మికులు పనులు లేక వేరే చోట ఉండలేక రవాణా వ్యవస్థ లేక కాలిబాట పట్టడం జరిగింది. దీంతో కరోనా వైరస్ కంటే వలస కార్మికులు ఎండ బాటలో నడుస్తూ కోట్లాదిమంది దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల ను సైతం లెక్కచేయకుండా నడవడంతో చాలామంది వైరస్ కంటే ఈ విధమైన నడక ద్వారా చనిపోయే వాళ్లు ఎక్కువ ఉంటారని భావించారు. అయితే ఎట్టకేలకు మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయములో కొన్ని ప్రత్యేకమైన రైళ్లు తిప్పి కొంత మందిని గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది.

 

ఇదిలా ఉంటే తాజాగా మరొక్కసారి వలస కార్మికుల విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే అన్ని రాష్ట్రాల ఛీప్ సెక్రటరీలకు వలస కార్మికుల విషయంలో స్పందించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. జాతీయ వలస కూలీల సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ నేతృత్వంలో ఏర్పాటైన ఎన్.ఐ.ఎమ్.ఎస్ కు కూలీల సమాచారం పంపించాలని కోరారు.ప్రతి రాష్ట్రంలో ఉన్న, ఆయా రాష్ట్రాలను దాటుతూ వెళ్తున్న కూలీల వివరాలను సమాచార కేంద్రం డాష్ బోర్డులో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.

 

ప్రతి రాష్ట్రం ఎన్.ఐ.ఎమ్.ఎస్ కు అనుసంధానం కావాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి రైల్వేశాఖ సిద్దంగా ఉందని రైల్వే మంత్రి పీయూష్ గోయాల్ చెప్పారు. ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికుల జాబితాను కలెక్టర్ లు సిద్దం చేయాలని అన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ వలస కార్మికులకు ప్రత్యేకమైన బస్సులు కేటాయిస్తూ వాళ్లకి 500 రూపాయలు నగదు కూడా ఇస్తూ గమ్యస్థానాలకు చేర్చడానికి తన వంతు కృషి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: