ప్రస్తుతం ప్రపంచ దేశాలను చిగురుటాకుల వణికిస్తున్న కరోనా వైరస్ మొదట చైనా దేశంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చైనాలోని ఊహన్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ చైనాలో విలయతాండవం చేసి ఎంతో మందిని బలితీసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన చైనా ప్రభుత్వం కరోనా ను  నియంత్రించడంలో సక్సెస్ అయింది  అనే చెప్పాలి. అయితే నెల రోజుల క్రితం ఈ మహమ్మారి వైరస్ వ్యాధులు పూర్తిగా చైనా దేశంలో తగ్గిపోయాయి. కాని గత కొంతకాలంగా మళ్లీ అక్కడ కరోనా  వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

 

 

 అయితే చైనా కు మరోసారి కరోనా  వైరస్ ముప్పు పొంచి ఉందని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా చైనీయుల్లో  వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా ఈ వైరస్ వ్యాప్తి మరోసారి అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి చైనాలో మరోసారి కేసులు పెరుగుతుండడం కూడా ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో ఈ వైరస్ కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్  నగరంలో ప్రజలు  మళ్ళీ  భయాందోళనలు చెందుతున్నారు. 

 

 

 ఎందుకంటే గత కొన్ని వారాలుగా వుహాన్  నగరంలో కరోనా  కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అంతే కాదు అంతకు ముందు వరకూ కరోనా  సోకిన వారిలో లక్షణాలు కనిపించాయి.  కాని ప్రస్తుతం కరోనా నిర్దారణ అయిన వారిలో ఎలాంటి లక్షణాలు కూడా బయటపడక పోవడం మరింత ఆందోళన కలిగించే అంశం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చైనా దేశం ముందు  అతి పెద్ద సవాలు ఉందని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: