కరోనా వైరస్ పుణ్యమా ప్రపంచంలో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. కరోనా వైరస్ ప్రపంచంలో రాకముందు వేటికీ ఎక్కువ విలువ వస్తువుల కే గానే మనుషుల కే గానే వాటిని ప్రస్తుత ప్రపంచంలో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకానొక టైంలో సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు అంటూ వాళ్ళ స్థాయికి తగ్గ విధంగా మనుషులు గౌరవించే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటువంటి తరుణంలో మొన్నటి వరకు డబ్బు ఉన్న దేశాలు అని పిలవబడే దేశాలలో ప్రస్తుతం ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఇండియా లో అయితే పరిస్థితి వర్ణనాతీతం. కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించడంతో పేద మరియు మధ్యతరగతి అదేవిధంగా వలస కూలీలు అనేక అవస్థలు పడుతున్నారు.

 

లాక్ డౌన్ వలన దేశంలో అన్ని క్లోజ్ అవటంతో ఇంటిలో ఉన్న అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడటంతో సంపాదించుకోవడానికి అవకాశాలు లేకపోవడంతో ఇండియాలో కూడా ఆకలి కేకలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఏర్పాటుచేసిన  క్వారంటైన్ కేంద్రంలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో  క్వారంటైన్ కేంద్రంలో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే ఈ గొడవ జరిగింది దేనికోసం అనుకుంటున్నారా. నీళ్ల కోసం  క్వారంటైన్ కేంద్రంలో కరోనా వైరస్ రోగులు భయంకరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 

బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా పుల్హారా టౌన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కరోనా బాధితుల కోసం తాత్కాలికంగా క్వారంటైన్ కేంద్రంగా ఈ దాడి జరిగింది. ఒకరిపై ఒకరు బక్కెట్లు బిందెలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో ఆ ఐసోలేషన్ కేంద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నివారణ చర్యలు చేపట్టి ఆ తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరు నీళ్లు తీసుకునేలా చొరవ చూపారు. ఆఖరికి కరోనా వైరస్ రాకతో ప్రపంచంలో నీళ్ల కోసం కూడా కొట్లాడుకునే పరిస్థితి దిగజారి పోయింది అని ఈ వీడియో సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: