దేశంలో ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సమయంలో పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు వారు చేస్తున్న సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయని పొగుడుతున్నారు.  కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో వారిప్పుడు ప్రధాన సైనికులు. వారు లేకుంటే కరోనాను ఎవరూ ఏమీ చేయలేరు. ఈ పచ్చినిజం తెలియక కొందరు మూర్ఖులు వారిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అద్దె ఇళ్లనుంచి వారిని నిర్దయగా ఇళ్లు కాళీ చేయిస్తున్న ఘటనలు చూస్తున్నాం.  శివుడు మూడోకన్ను తెరిస్తే సర్వం భస్మమే అన్నట్టు.. ఇప్పుడు వైద్యసిబ్బంది కూడా శివుడి మూడోకన్నులాంటివారే. వారిప్పుడు ప్రత్యక్ష దేవుళ్లు.   ప్రవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే 300లకు పైగా నర్సులు ఉద్యోగాలను వీడి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో కరోనాపై యుద్ధంలో సైనిక శక్తి తగ్గినంత పనైంది.

 

కోల్‌కతా, హౌరాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులలో పనిచేసే నర్సులు. మణిపూర్‌, త్రిపుర, ఒడిషా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారంతా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు.  ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హాకు, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ తూర్పు భారత ఆసుపత్రుల సంఘం (ఏహెచ్‌ఈఐ) లేఖ రాసింది.  ఇలా ఉన్నట్టుండి వారు ఎందుకు వెళ్లిపోయారో తెలియని పరిస్థితి. ణిపూర్‌కు తిరిగివచ్చిన వారికి ఆకర్షణీయ స్టైఫండ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్‌ చేసిందని తెలిసిందని లేఖలో పేర్కొన్నారు.

 

ఈ ఆరోపణలపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సోషల్ మీడియాలో స్పందించారు. అయితే నర్సులపై వస్తున్న రూమర్లు నమ్మోద్దని.. మా రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఏ ఒక్కరినీ తిరిగి రావాలని మేము కోరలేదు. కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో వారు సేవలందించడం మాకు గర్వకారణం. డాక్టర్లు, నర్సులు వారు పనిచేసే ఆసుపత్రుల్లో అసౌకర్యంగా భావిస్తే అది వారు పనిచేసే సంస్థల నిర్వాహకులే అందుకు బాధ్యత వహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: