గత కొంతకాలంగా సుప్రీంకోర్టు వాస్తవికతకు దగ్గరగా ఉండేలా తీర్పులను  వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న కొంతమంది వలస కార్మికుల విషయంలో  సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వలస కార్మికులు రోడ్డు మార్గంలో నడవనివ్వకండి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ప్రభుత్వాలు వలస కార్మికులకు తరలింపు చర్యలు అందుబాటులోకి తెచ్చేంత  వరకు కార్మికులు ఓపికతో ఉండాలని... తాము నడిచి వెలతాము  అని అనుకున్న కార్మికులను ఎలా  సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది అంటూ పిటిషన్ కొట్టి  వేసింది. అంతేకాకుండా రైలు పట్టాలపై పడుకుంటే ప్రమాదం జరగకుండా ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించింది . 

 

 ఇదే తరహాలో తాజాగా మరో అంశం పై కూడా తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. చిన్న చిన్న సంస్థలు చాలా మంది కార్మికులకు జీతాలు ఇవ్వలేకపోయయని.. కార్మికుల ఇబ్బంది పెడుతున్నారని జీతాలు చెల్లించేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... వలస కార్మికుల కోసం అంతర్ రాష్ట్ర రవాణా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని.. కార్మికులందరూ రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నిర్దేశించిన సమయం వరకూ వేచి ఉండాలని సూచించారు

 

 అదే సందర్భంలో పూర్తిగా జీతాలు చెల్లించే లేకపోయినా సంస్థలకు సంబంధించిన పిటిషన్లు దాఖలు అవ్వగా.. ఆయా కంపెనీలు యజమానులపై వచ్చే వారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. చాలా చిన్న కంపెనీలకు కరోనా కారణంగా ఎలాంటి ఆదాయం లేకుండా పోయిందని.. అందువల్ల జీతాలు ఇవ్వలేక పోయాయి అంటూ వ్యాఖ్యానించారు. ఆయా సంస్థల యజమానుల నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలంటూ ప్రస్తుతం పిటిషనర్లు కోరుతున్నారు.. వాళ్లే ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి ఉంటే జీతాలు చెల్లించడం ఎలా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కింద చెల్లించాలని కోరి ఉంటే బాగుండేది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: