దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మొదట్లో అతి తక్కువగా ఉన్న కేసులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో పెరిగి పోతుండటంతో ఏకంగా చైనా దేశానికి కూడా దాటేసింది  భారత్. భారత్లో రోజుకు ఏకంగా మూడు నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతుండటం  ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. ఇదే సందర్భంలో అసిమ్టమాటిక్  కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. అసలు ఎవరి ద్వారా ఎవరికి కరోనా వ్యాప్తి  అవుతుంది అన్నది నిర్ధారణ కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సమయంలో అటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు  ఇస్తూ వస్తోంది. 

 

 ఎందుకంటే ఇప్పటికే 40 రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోయింది . క్రమక్రమంగా ప్రజల నుంచి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా  మహమ్మారి తో సర్దుకుపో తప్పదు అని వ్యాఖ్యానించడంతో... ఇక ప్రపంచ దేశాలు సైతం ప్రస్తుతం క్రమక్రమంగా లాక్ డౌన్  సడలింపులు  ఇస్తుండడం చేస్తున్నాయి. ఇక ఈ దశలో ఇండియాలో లెక్క చూస్తే.. ఇప్పటివరకు నమోదైన కేసులలో 79 నుంచి 80 శాతం కేసుల్లో కేవలం దేశంలోని 30 నగరాలలో మాత్రమే ఉన్నాయి అని నిర్ధారణ అయింది. 

 


 అయితే ప్రపంచంలో ప్రతి వందమందిలో 6.9 శాతం మంది కరోనా తో  చనిపోతున్నారు. కాని భారతదేశంలో మాత్రం ప్రతి 100 మందిలో 3.2 శాతం మంది మాత్రమే ఈ మహమ్మారి వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్  సడలింపు ఇవ్వటం కారణంగా మళ్ళీ కరోనా  విజృంభించే అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 30నగరాల్లోనే వేగంగా  వ్యాప్తి కూడా జరుగుతుంది అని అంటున్నారు .దీనికి సంబందించిన  పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: