కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఫిబ్రవరి మాసం నుండి చైనా దేశం నుండి ఇతర దేశాలకు అతి తక్కువ రోజుల్లో వ్యాపించి అగ్రరాజ్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షలకు దగ్గరలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా...ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య మూడు లక్షల ను మించిపోయి ఉంది. ఇంతటి ఘోర విపత్కరమైన వైరస్ ని ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కోవాలో తెలియక గందరగోళంలో పడుతున్నాయి. ఇండియా దేశంలో కూడా రోజురోజుకీ వైరస్ ప్రభావం ఊహించని స్థాయిలో పెరిగిపోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లు కొనసాగించు కుంటూ పోతున్నారు. కనిపించని ఈ కరోనా వైరస్ శత్రువు నీ కంట్రోల్ చేయలేకపోవడంతో మరోపక్క ఆర్థిక కష్టాలు ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో కొద్ది సడలింపులు ఇస్తూ ప్రభుత్వాలు ప్రజలకు ఊరట ఇస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చికిత్సలో భాగంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారికి సూపర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి మేటర్ లోకి వెళితే హోమ్ ఐసొలేషన్ సూచనల ప్రకారం, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కాంటాక్ట్ లకు వ్యాధి లక్షణాలు కనిపించకుంటే, ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.

 

వారిని ఓ ప్రత్యేక గదిలో 17 రోజులు పర్యవేక్షణలో ఉంచి, రోగులకు సాయంగా ఓ వ్యక్తిని ఉంచి, అతనికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు అందిస్తామని, వారిని వైద్య బృందాలు రెండు పూటలా పర్యవేక్షిస్తారని, ఆ కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలను స్వయంగా అందిస్తామని వైద్య శాఖ మంత్రి ఈట‌ల వెల్ల‌డించారు. ఈ చికిత్స విధానాన్ని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిర్దేశించిన విధానాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా రోగులకు మొదటి పది రోజులు ఆసుపత్రిలో తరువాత మిగతా పదిహేను17 రోజులు ఇంటిలోనే చికిత్స అందించడానికి రెడీ అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: