కేరళలో 10రోజుల ముందువరకు కేవలం 16 యాక్టీవ్ కేసులు మాత్రమే ఉండగా ఈరోజు తో అక్కడ యాక్టీవ్ కేసుల సంఖ్య 101 కు చేరింది. దీనికి కారణం విదేశాల నుండి అలాగే  ఇతర రాష్ట్రాల నుండి  సొంత రాష్ట్రానికి వస్తుండడంతో కేసులు సంఖ్య పెరుగుతూ వుంది. ఇక ఈరోజు కొత్తగా మరో 14కేసులు నమోదయినట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 601కి చేరుకోగా అందులో 497మంది బాధితులు కోలుకోగా ముగ్గురు మరణించారు. 
ఇక ఈరోజు తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుండడం తో రేపటి నుండి మే 31వరకు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడం తో ఈనిర్ణయం తీసుకోక తప్పలేదు అయితే నాలుగో దశ లాక్ డౌన్ లో కూడా మినహాయింపులు ఇచ్చింది కానీ 31వరకు విమాన, రైళ్ల రాకపోకలపై నిషేదం విధించగా విద్యాసంస్థలు , రెస్టారెంట్లు , సినిమా హాళ్లు , పార్కులు పై కూడా నిషేధం కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: