కరోనాకు చికిత్స చేసే వైద్యులకు ఎన్‌-95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థిషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.  అయితే ఆ డాక్టర్ తాజాగా విశాఖపట్నంలో కాస్త హడావిడి చేశారు. మద్యం తాగి నిరసన చేశారు. దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని, మతిస్థిమితం సరిగా లేదని చెప్పి మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు.

 

ఇక ఈ డాక్టరుకు టీడీపీ మద్ధతు తెలిపి, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా తెలియజేశారు. సీఎం జగన్ దళిత వ్యతిరేకి అని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు డైరక్షన్‌లోనే ఆ డాక్టర్ నడుచుకున్నారని, దానికి దళిత కార్డు వాడుకోవడం దారుణమని మండిపడుతున్నారు.

 

టీడీపీ హయాంలో దళితులు ఊచకోతకు గురయ్యారని, ఆ కుటుంబాలను ఎప్పుడు అడిగినా బాబు దారుణాల గురించి చెబుతారని అంటున్నారు. ఇక బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుందని, ఎల్లో వైరస్ ప్రభావంతో వైజాగ్‌లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని విజయసాయి రెడ్డి  బాబు తీరుపై మండిపడ్డారు.

 

అటు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా బాబు అండ్ బ్యాచ్‌పై ఫైర్ అవుతున్నారు. జగన్‌ని దళిత వ్యతిరేకి అంటూ విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ గా అవును నిజమేలే రాష్ట్రంలో దళితులు ఎవరికి ఎక్కువ అండగా ఉంటారో తెలుసని, దళితులు జగన్‌కు ఎక్కువ అండ ఉండబట్టే ఎన్నికల్లో మొత్తం 36 ఎస్సీ,ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో వైసీపీ 34 గెలుచుకుందని, టీడీపీ ఒకటి గెలిస్తే, ఇంకొకటి జనసేన గెలుచుకుందని, దీని బట్టే దళిత వ్యతిరేకి ఎవరో అర్ధమైపోతుందిలే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: