ఏపీ రాజకీయాల్లో పార్టీల వారీగా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయ అంశాల్లో ఆ మీడియా పాత్ర ఏ మేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీలకు ఆ మీడియా సంస్థలే వెన్నెముక లాంటివి. అధికార వైసీపీకి కొన్ని అనుకూల మీడియా సంస్థలు ఉండగా, ప్రతిపక్ష టీడీపీకి మరికొన్ని అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి.

 

అయితే ఈ మీడియా సంస్థలు ఏం చేస్తుంటాయో మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడు వీటి పని వారికి అనుకూలంగా ఉన్నవారిపై పాజిటివ్ వార్తలు, వ్యతిరేకంగా ఉన్నవారిపై నెగిటివ్ వార్తలు ఇస్తుంటాయి. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదనే చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయం కాసేపు పక్కనబెడితే తాజాగా ఓ విషయంలో వైసీపీ అనుకూల మీడియా ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ్‌రెడ్డి గురించి వార్త ఒకటి ఇచ్చింది.

 

టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ్‌రెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడని,  జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహిస్తే, అందులో శివనాథ్‌రెడ్డి కూడా దొరికారని చెప్పింది. అయితే పేకాటడితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఎలాంటి తప్పు లేదని కానీ శివనాథ్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ అని పెద్దగా చెప్పి నెగిటివ్ చేసే ప్రయత్నం చేయడం వింతగా ఉందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.

 

ఎందుకంటే శివనాథ్‌రెడ్డి ఇప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా లేరని, మండలిలో మూడు రాజధానులు బిల్లు విషయంలో పోతుల సునీతతో పాటు శివనాథ్‌రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఓటేశారని, దీంతో విప్ ధిక్కరించిన సునీత, శివనాథ్‌రెడ్డిపై వేటు వేయాలని టీడీపీ కోరిందని గుర్తుచేస్తున్నారు. ఇక ఇందులో సునీత వైసీపీలో చేరిపోతే, శివనాథ్‌రెడ్డి ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని, ఆయన టీడీపీలో లేరని, కానీ వైసీపీ అనుకూల మీడియా కావాలని టీడీపీ ఎమ్మెల్సీ అంటూ నెగిటివ్ చేసే ప్రయత్నం చేసిందని మండిపడుతున్నారు. త్వరలో ఆయన వైసీపీలోకి వస్తే అదే అనుకూల మీడియా టీడీపీకి భారీ షాక్..వైసీపీలోకి కీలక నేత అంటూ రాస్తుందని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: