వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల కంటే న్యాయస్థానాల్లో నే ఎక్కువగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చే ఏడాది కావస్తున్న క్రమంలో తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానంలో వీగిపోయాయి. దీంతో చాలా వరకు వైఎస్ జగన్ సర్కార్ కి ప్రధాన ప్రతిపక్షం టిడిపి కాదు హైకోర్ట్ అనే ముద్ర ఏపీ ప్రజలలో పడిపోయింది. ఇంగ్లీష్ మీడియం విషయంలో అదే విధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు భూములు ఇచ్చే విషయంలో జగన్ సర్కార్ కి ఎదురు దెబ్బ తగలటం మనకందరికీ తెలిసిందే. కాగా కరోనా వైరస్ రాకముందు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన రాజకీయ ఇష్యూ నిమ్మగడ్డ వ్యవహారం. స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆపేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 

ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖ కి రాసిన లెటర్ కీలకంగా మారడంతో ఈ విషయం న్యాయస్థానంలో ఉంది. కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చి తనని ఉద్దేశపూర్వకంగా వైయస్ జగన్ సర్కార్ తొలగించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ  సంబంధించి కోర్టు వాదనలు విన్న తరువాత తీర్పు రిజర్వు చేయడం జరిగింది. ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు న్యాయస్థానంలో తెలిపింది.

 

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనంతీర్పు వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. అయితే ఈ విషయంలో ఎటువంటి తేడా గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే జగన్ సంచలన డెసిషన్ ఇప్పటికే తీసుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. బలమైన లాయర్లతో ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఏదిఏమైనా ఈసారి న్యాయస్థానాల విషయంలో జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని బలమైన లాయర్లను ప్రభుత్వం తరఫున పెట్టాలని అనుకుంటున్నట్లు అర్థమవుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: