కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైనా దేశం పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. చైనా  ల్యాబ్లో ఈ మహమ్మారి వైరస్ సృష్టించి  ప్రపంచ దేశాల వినాశనానికి వ్యాప్తి చెందేలా చేసింది అని ఎన్నో విమర్శలు చైనా దేశం పై వచ్చాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ఇప్పటి వరకు చైనా మాత్రం ఎక్కడా స్పందించిన దాఖలాలు మాత్రం లేవు. 

 


 అయితే తాజాగా చైనా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నిజాన్ని ఒప్పుకుంది . కరోనా  కు సంబంధించిన మొదటి నమూనాని ధ్వంసం చేశాము  అంటూ చెప్పుకొచ్చింది చైనా.  నేషనల్ హెల్త్ కమిషన్కి చైనా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పటికి సార్స్ కోవిడ్ 2 ని గుర్తించకపోవడంతో.. ఆ నమూనాల కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అనే అనుమానంతో.. ఆ నమూనాలను ధ్వంసం చేశాము  అంటూ చైనా తెలిపింది. 

 


 ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ లోని సైన్స్ అండ్ హెల్త్  భాగానికి చెందిన లూ  డెంట్ అనే నిపుణుడు ప్రకటించారు. అనుమతి లేని ప్రయోగశాలలో ఈ నమూనాలను  మాత్రమే ధ్వంసం చేయాలని పేర్కొన్నారు... కానీ ఈ విషయాన్ని అమెరికా అధికారులు మాత్రం వక్రికరించి గందరగోళం సృష్టించారు అంటూ ఆరోపించింది చైనా. వాస్తవానికి గుర్తు తెలియని నిమోనియా గుర్తించేందుకు ఎన్నో పరిశోధనశాలలూ  రంగంలోకి దిగిన నేపథ్యంలో.. ఈ క్రమంలోనే ఈ వైరస్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యేంతవరకు ఈ వైరస్ అడ్డుకునేందుకు.. నమూనాలను వ్యాప్తి కారకంగా  భావించామని.. అందుకే రక్షణ సదుపాయాలు లేని ప్రయోగశాలలో ఈ మొదటి నమూనాలను ధ్వంసం చేయాలని చెప్పాము  అంటూ తెలిపింది. చైనా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నిజాన్ని ఒప్పుకుంది చైనా.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: