దేశానికి వ్యవసాయం వెన్నుముక లాంటి అన్న విషయం తెలిసిందే. వ్యవసాయం అనేటువంటిది ఎంత తరచి చూసినా ఎక్కడో ఒక చోట డొల్లతనం  అనేటువంటి ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యవసాయంలో సమస్యలు మొత్తం పరిష్కారం అయేటువంటిది  ఉండదు అంటున్నారు విశ్లేషకులు. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ఎఫర్ట్  పెట్టడానికి మాత్రం సిద్ధమవుతూ ఉంటారు అని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం కరొనా నేపథ్యంలో  నిర్మల సీతారామన్ రైతుల కోసం ప్రకటన చేయటం  ఒక ఎత్తయితే... కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వారు తేల్చి చెబుతున్న ఇటువంటి అంశం ఏమిటంటే... ఎక్కడ ధర ఎక్కడ  ఉంటే అక్కడికి తీసుకెల్లి  పంటను అమ్ముకునే అవకాశాన్ని రైతులకు కల్పించింది. 

 

 అయితే ప్రస్తుతం రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ద్వారా ఎక్కడైనా పంటలు అమ్ముకోవడానికి వీలు ఉంటుందని చెప్పినప్పటికీ.. ఇలా అమ్ముతోంది  మాత్రం దళారుల అని చెప్పాలి. ఎందుకంటే రైతులకి  ఆన్లైన్ ద్వారా ఎలా అమ్మాలి ఎలా వివరాలు తెలుసుకోవాలి తెలియదు కాబట్టి దళారులకు అమ్మడం దళారులు వెళ్లి ఎక్కువ ధర పలికిన మార్కెట్లో అమ్మడం ద్వారా భారీ మొత్తంలో లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ద్వారా రైతులు  ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తన పంటలు అమ్ముకోవడానికి వీలు ఉంటుంది. 

 


 అయితే ప్రస్తుతం రైతుల్లో కూడా ఎంతో మంది విద్యావంతులు ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. అయితే ఇందులో ప్రాబ్లం కూడా లేకపోలేదు... అయితే తమ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అక్కడి రైతులు ఈ ప్రక్రియకు అడ్డు పడే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఎవరైనా ఇతర రాష్ట్రాల రైతులు తమ  రాష్ట్రానికి పంటలు తీసుకెళ్లినప్పుడు మొదట ఆ రాష్ట్రానికి చెందిన రైతుల ప్రయోజనాలు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు అనే ఒక వాదన  తెర మీదికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. అందుకే చట్టాలు చేయడం కాదు  వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యం  అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: