దేశ‌వ్యాప్తంగా నేటి నుంచి నాలుగో విడ‌త లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈమేర‌కు నిన్న‌ క‌రోనా వైర‌స్‌ దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం తాజాగా నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సారి అత్యంత కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని కేంద్రహోంశాఖ తెలిపింది. కంటైన్మెంట్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల గుర్తింపు అధికారం రాష్ట్రాలకే అప్పగించింది. కరోనా హాట్‌స్పాట్స్‌ కేంద్రాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కంటైన్మెంట్‌జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.  అంతర్రాష్ట బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.  65ఏళ్లు దాటినవారు, గర్బిణీ మహిళలు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని కేంద్రం సూచించింది.

 

అంతేగాకుండా మ‌రికొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. కాలేజీలు, స్కూళ్లకు మే 31వరకు అనుమతి లేదు. సినిమా థియేటర్లు,  దేవాలయాలు మూసివేత కొనసాగింపు. హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం. రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు. మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్‌. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్‌. స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, మే 31వరకు బంద్‌. ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది అతిథులతో పెళ్లిళ్లకు అనుమతి. అన్ని రాష్ట్రాల మధ్య వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది. ప్రయాణానికి అనుమతి. బార్బర్‌ షాపులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఓపెన్‌ చేసేందుకు  అనుమతి. ఆహార పదార్థాలను హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేస్తాయ‌న్న‌ది కీల‌కంగా మారుతోంది. కొన్ని నిర్ణ‌యాల అధికారాల‌ను కేంద్రం అప్ప‌గించ‌డంతో స‌డ‌లింపులు ఎలా ఉంటాయ‌న్న‌దానిపై ప్ర‌జ‌లు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: