లాక్‌డౌన్ 4.0పై ఫుల్ క్లారిటీ  కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ఇచ్చిన నేప‌థ్యంలో ప్ర‌జార‌వాణాను పునఃప్రారంభించేందుకు  తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌కు కొన్ని ప్ర‌త్యేక నిబంధ‌న‌లను జ‌త‌చేర్చి బ‌స్సు ప్ర‌యాణాల‌పై ఓ విధానాన్ని రూపొందింస్తోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోమ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు మంత్రిమండలి సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలోనే ఆర్టీసీ బ‌స్సుల ప్రారంభం..ప్ర‌యాణంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న వివ‌రించనున్నారు. ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్‌డౌన్‌ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ  సమావేశంలో ముఖ్య‌మంత్రి మంత్రివ‌ర్గంతో చర్చించనున్నారు. 

 

అంత‌కుముందు సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించ‌నున్నారు.  ఇప్పటికే 50 శాతం బస్సులను తిప్పేందుకు కేంద్ర అనుమతులున్నా వ్యాధి వ్యాపిస్తుందనే అనుమానంతో ప్రభుత్వం నడపలేదు. తాజాగా రాష్ట్రంలో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలనే భావిస్తోంది. కంటెయిన్‌మెంటు జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధాని ప్రాంతాల్లో బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డిపించేందుకు తెలంగాణ‌ ప్ర‌భుత్వం మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. పరిమిత స్థాయిలో ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి, వ్యక్తిగత దూరం పాటించేలా చూడ‌టం వంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు. అదే క్ర‌మంలో ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ఇప్పుడే వ‌ద్దు అన్న కోణంలో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  


అయితే దీనిపై మంత్రిమండలిలో సమగ్రంగా చర్చించి త‌ర్వాతే విధానాలకు తుది రూప‌క‌ల్ప‌న పూర్త‌వుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం 50శాతం బ‌స్సుల‌ను న‌డిపించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించినా రిస్క్ అవుతుంద‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేదు. ఈనేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారుతోంది. లాక్‌డౌన్ విష‌యంలో ఎంత‌మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌న్న‌ది ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌టి నుంచి చెప్పుకొస్తున్న మాట‌. ఆయ‌న దానికి క‌ట్టుబ‌డే నిర్ణ‌యాల్లో ఎలాంటి తొనుకు బొనుకు లేకుండా ఉక్కుపాదంతో లాక్‌డౌన్ అమ‌లుకు ఆదేశాలు జారీ చేశారు. దాని ఫ‌లితంగానే రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ‌లో ఉంద‌న్న‌ది వాస్త‌వం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: