చైనాలోని పుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రపంచాన్ని గడ గడలాడిస్తుంది.  ఈ కరోనా మొదలైనప్పటి నుంచి దాన్ని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్లా కావడం లేదు. ఇప్పటి వరకు ఏదేశం కూడా దీనికి వ్యాక్సిన్ కనుగొనలేకపోయింది.  కరోనా రోగుల నుంచి ఇది ఇట్టే ప్రబలిపోతుంది.  ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఆర్థిక నష్టం దారుణంగా జరుగుతుంది. ఇక సినీ పరిశ్రమకు తీరని నష్టాలన్ని మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.. రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో కొన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాల్స్, థియేటర్లకు అనుమతి లభించినా ఎన్నో కండీషన్లు పెడుతున్నారు.  ఇక మన దేశంలో థియేటర్లు ప్రారంభం కావాలంటే మరింత సమయం పట్టవొచ్చు అంటున్నారు.

 

తాజాగా లాక్ డౌన్ కారణంగా దాదాపు ధియేలర్లు మూతపడి రెండు నెలల అయ్యింది. అయితే మరో మూడు నెలల పాటు థియేటర్లు తిరిగి తెరచుకునే అవకాశాలు లేవని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం కొన్ని మార్పులు చేర్పులు చేసినా ఇప్పట్లో మాత్రం తెరుచుకునేలా అనిపించడం లేదు.  అయితే ఫిబ్రవని నెల నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి.. మార్చి నెల నుంచి మాల్స్, థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కరోనా పూర్తి స్థాయిలో కట్టడి అయ్యేవరకు థియేటర్లపై ఆక్షంలు సడలించేలా లేదనిపిస్తుంది. 

 

కారణం ఏదైనా.. ఇది జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశం కనుక దీనిపై సమగ్ర ఆలోచన చేయాలని అన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లోనే థియేటర్లు ప్రారంభిస్తే, వైరస్ సమస్య అధికమవుతుందని మళ్లీ మొదటికి మోసం వస్తుంది.. ఆ ప్రభావం తిరిగి ప్రజలపైనే పడుతుందని అన్నారు. అంతే కాదు థియేటర్లకు ప్రేక్షకులు కూడా రాకపోవచ్చని తలసాని అంచనా వేశారు. జిల్లా స్థాయిలో సీటింగ్ ను తగ్గిస్తే, సినిమా హాల్స్ యజమానులు ఆర్థికంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: