మ‌న దేశంలోని ప‌లు మెట్రో న‌గ‌రాల్లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎంతో విలాస వంత‌మైన ల‌గ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేసిన యువ‌తుల బాధ‌లు ఇప్పుడు కరోనా దెబ్బ‌తో మామూలుగా లేవు. చెన్నై, ముంబై, క‌ల‌క‌త్తా, హైద‌రాబాద్‌లో న‌గ‌రాల్లో ఖ‌రీదైన జీన్స్ .. టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకుని.. జుట్టు విర‌బోసుకుని.. బ్యాగ్‌లు వేసుకుని.. ఎంచ‌క్కా ముస్తాబై షాపింగ్ మాల్స్‌.. మల్టీఫ్లెక్స్ లు అంటూ నానా హ‌డావిడి చేసే అమ్మాయిల ప‌రిస్థితి ఇప్పుడు పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. ఇక దేశంలోని మ‌హా న‌గ‌రాల్లో ఒక‌టి అయిన హైద‌రాబాద్ లో అమ్మాయిలు క‌రోనాకు ముందు వ‌ర‌కు నానా హ‌డావిడి చేసేవారు. నార్త్ ఇండియ‌న్ రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఇక్క‌డ‌కు త‌ర‌లి వ‌చ్చిన వీరంతా సాఫ్ట్ వేర్ జాబ్‌ల‌తో పాటు అనేక రంగాల్లో స్థిర‌ప‌డ్డారు.

 

ఇందులో స్పా, మసాజ్, బ్యూటీ సెంటర్లు కూడా ఎక్కువే. ఇక్కడున్న ఆయా సంస్థలు తమ సిబ్బంది ద్వారా స్టార్‌ హోటళ్లు, మాల్స్‌లలోని సెంటర్లో విధుల్ని నిర్వర్తిస్తున్నాయి. ఇక లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌ట్లో థియేట‌ర్లు, మాల్స్‌, స్పా సెంట‌ర్లు, మ‌సాజ్ సెంట‌ర్లు, సెలూన్ల‌కు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని చెప్ప‌డంతో ఈ యువ‌త‌కు ఉపాధి క‌రువైంది. దీంతో ఈ రెండు నెల‌లుగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న దాంతో ఏదోలా నెట్టుకుని వ‌చ్చిన యువ‌తులు అంతా ఇప్పుడు బ‌తుకు జీవుడా అంటూ త‌మ సొంత రాష్ట్రాల‌కు వెళ్లి పోయేందుకు రెడీ అవుతున్నారు. 

 

ఇక హైద‌రాబాద్ లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన అమ్మాయిలు క‌రోనా లేన‌ప్పుడు ఆటోలో వెళ్లేందుకు రు. 500 అయినా వెనుకాడ కుండా ఇచ్చేసేవారు. ఇప్పుడు డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఆటో డ్రైవ‌ర్ల‌ను రు.100 ఇస్తామ‌ని బ‌తిమి లాడుకుంటోన్న దృశ్యాలు హైద‌రాబాద్‌లో ప‌లువురిని కంట త‌డి పెట్టిస్తున్నాయి. వీరికి తిన‌డానికి తిండి లేక రొట్టెలు, బ్రెడ్‌ల‌తోనే క‌డుపు నింపుకునే ప‌రిస్థితి. చివ‌ర‌కు వీళ్లు ఆయా రాష్ట్రాల భ‌వ‌న్‌ల‌ను సంప్ర‌దించాల్సిన ప‌రిస్థితి. అలా అక్క‌డ నుంచి త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోతున్నారు. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: