నల్లజాతీయుల హక్కులకోసం పోరాడిన మహానుభావుడు నెల్సన్ మండేలా. ప్రత్యర్థులపై దూకుడు స్వభావం మరియు పోరాటపటిమ అనేది బాహ్యంగా చేయకుండా వారిని అగౌరవ పరచటం కూడా వారిపై గెలిచిన నాయకుడు నెల్సన్ మండేలా. ఇందువల్లనే నెల్సన్ మండేలా ప్రపంచానికి ఆదర్శప్రాయుడు అయ్యాడు. జాతివివక్షకు చరమగీతం పాడారు. జాతిని ఏకం చేయడం కోసం మండేలా తీవ్ర కృషి చేశారు. ఆయన ప్రసంగాలు జాతిని ప్రభావితం చేశాయి. ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు, వ్యవస్థలు విధానాలు మనుషులను చెడ్డ వాలుగా శత్రువులుగా చిత్రీకరిస్తాయిని తెలిపారు. జాతి వివక్షత ప్రజలను బలి తీసుకుంటుందని వివక్షతను పాటించే వారికి కూడా సొంత మనుషులను కోల్పోవాల్సి వస్తుందని తెల్ల జాతీయులకు అర్థమయ్యేరీతిలో చెప్పారు.

 

జీవితాన్ని మీరు ఎంత గా ప్రేమిస్తారో నేను కూడా అంతగా ప్రేమిస్తున్నాను స్వేచ్ఛగా నా హక్కు మీ హక్కు వేరు వేరు కాదు అని చెప్పి తన జాతికి నమ్మకాన్ని ధీమా నీ కల్పించిన మహానుభావుడు నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికాలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు నెల్సన్ మండేలా. మండేలా కుటుంబం ఆఫ్రికాలో టెంబో వంశానికి చెందినది. 1918 జులై18  నా జన్మించారు. బాల్యం మరియు కాలేజీ వయసులో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పలువురు యూనివర్సిటీలకు పట్టభద్రులయ్యారు నెల్సన్ మండేలా. ఆ తరువాత జిల్లా నల్లజాతీయుల మధ్య జరిగిన పోరాటాలలో మొదట శాంతియుతంగా పాల్గొన్న నెల్సన్ మండేలా 1956 డిసెంబర్ 5వ తారీఖున దేశద్రోహం నేరం పై అరెస్ట్ చేయబడ్డాడు. 1956 నుండి 1961 వరకు సుదీర్ఘంగా నడచిన ఈ విచారణలో నిర్దోషిగా విడుదలయ్యారు.

 

ఆ తరువాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సాయుధ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులు కూడా అయ్యారు. విభాగం దళారులను ప్రభుత్వ భవనాలను లక్ష్యం చేసుకుని దాడులు నిర్వహించేది. జాతి వివక్షతను అంతం అందించాలంటే గెరిల్లా పోరాటమే సరైన మార్గమని మండేలా నిర్ణయించుకున్నారు. అయితే ఈ విధమైన చర్యల వల్ల ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మానవహక్కులను ఉల్లంఘించిందని మండేలా ఒప్పుకున్నాడు. అయితే అప్పట్లో 1962లో కొన్ని కారణాల వల్ల మండేలాను జైలుపాలు చేసింది అప్పటి ప్రభుత్వం. శ్వేతజాతి ప్రభుత్వం అప్పట్లో ఆయన నడిపిన పోరాటానికి జీవితకాల శిక్ష విధించింది. మొత్తం 18 సంవత్సరాలు మండేలా జైలు జీవితం గడిపారు. అంటే ఆయన జీవితంలో మొత్తంగా 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.

 

అయితే అప్పటి ప్రభుత్వంపై బయటనుండి మరియు దేశం లో నుండి మండేలాను విడుదల చేయాలని ఒత్తిడి రాగా ఫిబ్రవరి 11, 1990 లో ఆయన ను రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఆయన రిలీజ్ చేయటానికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాయి. ఆ తరువాత దక్షిణ ఆఫ్రికాలో అన్ని జాతుల వారికి 1994లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా మండేలా చొరవ తీసుకున్నారు. ఆ సమయంలో పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. జరిగిన ఈ ఎన్నికలలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 62 శాతం ఓట్లను సాధించింది. 1994 మే10 వతారీఖు నెల్సన్ మండేలా మొట్ట మొదటి నల్ల జాతీయ అధ్యక్షుడగా దక్షిణాఫ్రికా కి సంబంధించి పదవి బాధ్యతలు చేపట్టారు. 

 

అధ్యక్షుడిగా ఆయన చూపించిన చొరవకు ప్రపంచం నలుమూలల నుండి ప్రశంసలు అందాయి. ఆ తరువాత మానవ హక్కులు పేదరిక నిర్మూలనకు సంబంధించి అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మండేలా ఎన్నో జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు . 1993లో మండేలా నోబెల్ అవార్డు అందుకున్నారు. ఇంకా అనేక మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధ్యక్షుల చేత అనేక పురస్కారాలు అందుకున్నారు. మూడు వివాహాలు ఆరుగురు సంతానం కలిగిన నెల్సన్ మండేలా కి 20 మంది మనవడు మనవరాలు ఉన్నారు. అయితే చివరాకరికి శ్వాసకోస సంబంధిత వ్యాధితో పోరాడి 2013 డిసెంబర్ 6వ తారీఖున జోహాన్స్బర్గ్ లో ఈ నల్ల సూరీడు అస్తమించాడు. ఏం అంత్యక్రియలకు వివిధ దేశాల నుండి 90 మంది అధ్యక్షులు 80 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: